EMI Bouncing: మీ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇలా చేయండి
ABN , Publish Date - Jun 22 , 2024 | 10:58 AM
ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని ఈఎంఐలు(emis) చెల్లిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఈఎంఐ అమౌంట్ సమయానికి చెల్లించలేక పోతారు. అలా పలు మార్లు చేయడం ద్వారా మీ ఈఎంఐలు బౌన్స్ అవుతాయి. ఇలాంటి క్రమంలో మీ సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని ఈఎంఐలు(emis) చెల్లిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఈఎంఐ అమౌంట్ సమయానికి చెల్లించలేక పోతారు. ఆ విధంగా మీరు కొన్ని నెలల్లో సమయానికి డబ్బును ఏర్పాటు చేయలేకపోతారు. అయితే రుణం తీసుకుని నిర్ణీత తేదీ రోజున EMI చెల్లించకుంటే అవి బౌన్స్ అవుతాయి.
ఆ క్రమంలో బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు మీరు చెల్లించాల్సిన మొత్తంపై రూ.500 నుంచి రోజువారీగా జరిమానా విధిస్తుంది. ఇలా పలుమార్లు సమయానికి EMI చెల్లించకుంటే మీ సిబిల్ స్కోర్(CIBIL score) దెబ్బతింటుంది. ఇలాంటి క్రమంలో సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకు మేనేజర్
మీ EMI బౌన్స్ అయితే బ్యాంకు ద్వారా జరిమానా విధించబడుతుంది. కానీ మీరు దీన్ని ఉద్దేశపూర్వకంగా చేయకపోతే మీరు వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. ముందుగా మీరు ఎక్కడ రుణం తీసుకున్నారో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి బ్యాంకు మేనేజర్ని కలసి మీ సమస్యను వివరించండి. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో దీన్ని చేయవద్దని మేనేజర్ మీకు సలహా ఇస్తారు. తదుపరి వాయిదాను సకాలంలో చెల్లించమని మిమ్మల్ని సూచిస్తారు. భవిష్యత్తులో ఇలా జరగదని మీరు వారికి భరోసా ఇవ్వడం లేదా మీ సమస్యను వారికి వివరించి పెనాల్టీ లేకుండా బయటపడొచ్చు.
సమస్య పెద్దదైతే
ఒకవేళ మీ సమస్య పెద్దదైతే మీరు మీ EMIని కొన్ని నెలలు వాయిదా వేయాలని బ్యాంకు మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కొంత సమయం తర్వాత ఆ డబ్బు ఏర్పాటు చేసినప్పుడు మీరు మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇది మీకు కష్ట సమయాల్లో కొంత ఉపశమనం కలిగిస్తుంది.
తర్వాత చెల్లింపు
మీకు EMI తేదీ నాటికి డబ్బులు అందకపోవడం, శాలరీ రాకపోవడం వంటి కారణాలతో ఈఎంఐ చెల్లించలేరు. ఆ క్రమంలో మీరు ఈఎంఐ తేదీని మార్చాలని బ్యాంక్ మేనేజర్‌ను కోరవచ్చు. ఆ క్రమంలో మీరు నెలాఖరులో కూడా మీ వాయిదాను చెల్లించుకోవచ్చు.
సిబిల్ స్కోర్
అయితే ఈ వాయిదా మూడు నెలల పాటు బౌన్స్ అయితే బ్యాంక్ మేనేజర్ మీ CIBIL స్కోర్ నివేదికను పంపిస్తారు. అలాంటి సమయంలో మీరు CIBIL ప్రతికూల నివేదికను పంపవద్దని మీరు బ్యాంక్ మేనేజర్ని అభ్యర్థించాలి. కొన్ని రోజులు లేదా మరికొన్ని నెలలు అవకాశం ఇవ్వాలని పూర్తిగా చెల్లింపులు చేస్తానని చెబితే మీ సిబిల్ స్కోర్‌ను పంపించకుండా ఉంటారు. ఇలా చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
New Telecommunications Act: మరికొన్ని రోజుల్లో కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం అమలు.. మార్పులివే..
T20 World Cup 2024: నేడు ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్.. పిచ్, విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..
Grocery Store: కిరాణా షాపులో కాల్పులు.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
For Latest News and Business News click here