Share News

New Rules: జూన్ 1నుంచి మారబోయే నిబంధనలివే

ABN , Publish Date - May 27 , 2024 | 06:50 PM

దేశవ్యాప్తంగా జూన్ 1నుంచి అనేక నిబంధనలు(Rules changing from June 1) మారబోతున్నాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి.

New Rules: జూన్ 1నుంచి మారబోయే నిబంధనలివే

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా జూన్ 1నుంచి అనేక నిబంధనలు(Rules changing from June 1) మారబోతున్నాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి.

సిలిండర్ ధర

చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను అప్‌డేట్ చేస్తాయి. మే నెలలో చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించాయి. డొమెస్టిక్ సిలిండర్‌లు, వాణిజ్య సిలిండర్‌ల ధరలు జూన్ 1న అప్‌డేట్ చేస్తారు.

బ్యాంకు సెలవులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం, జూన్‌లో 12 రోజుల పాటు బ్యాంకులు మూతబడతాయి. ఈ సెలవుల్లో ఆదివారం, రెండు, నాలుగో శనివారాలు ఉన్నాయి. జూన్ నెలలో బక్రీద్ కూడా ఉంది. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు సెలవులను గమనించాలి.


ఆధార్ అప్‌డేట్

ఇప్పటికీ మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయలేదా. UIDAI.. ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తే.. ఆధార్ కేంద్రానికి వెళ్లి ఒక్కో అప్‌డేట్‌కు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ నిబంధనలలో మార్పులు

వచ్చే నెల నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు(కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ 2024) అమల్లోకి రానున్నందున జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు కూడా మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం భారీగా జరిమానాలు విధించనున్నారు.

అతివేగంతో పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.అదే సమయంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500, హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. దాంతోపాటు మైనర్‌కి 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా చేస్తారు. ఇంకా చాలా వరకు నిబంధనలు మారాయి.

Jio vs Airtel: జియో, ఎయిర్‌టెల్‌.. రూ.999 రీఛార్జ్ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఎందులో?


For Latest News and Technology News

Updated Date - May 27 , 2024 | 08:01 PM