Share News

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:05 PM

ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులకు రిటైల్ చెల్లింపుల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చిందని RBI పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి స్థూల దేశీయోత్పత్తి (GDP)లో భారత్ డిజిటల్ ఎకానమీ 20 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) సోమవారం తెలిపారు.

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్
rbi governor shaktikanta das

ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులకు రిటైల్ చెల్లింపుల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చిందని RBI పేర్కొంది. ఇది లావాదేవీలను వేగంగా, మరింత సౌకర్యవంతంగా చేసిందని వెల్లడించింది. ఈ క్రమంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అయిన e-RUPI పైలట్ టెస్టింగ్‌తో డిజిటల్ కరెన్సీ రంగంలో RBI ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి స్థూల దేశీయోత్పత్తి (GDP)లో భారత్ డిజిటల్ ఎకానమీ 20 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 10 శాతంగా ఉందన్నారు. 2023-24కి సంబంధించిన రిపోర్ట్ ఆన్ మనీ అండ్ ఫైనాన్స్ (RBF) పరిచయంలో, ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్‌కు మార్గం సుగమం చేస్తుందని గవర్నర్ ఉద్ఘాటించారు.


ఇంటర్నెట్ వ్యాప్తి

ఈ నేపథ్యంలో డిజిటల్‌ విప్లవంలో భారత్‌ ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం ద్వారా దేశం ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (ఫిన్‌టెక్) మాత్రమే కాకుండా బయోమెట్రిక్ గుర్తింపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ లాకర్స్, డేటా షేరింగ్‌ రంగాల్లో దీని ప్రాముఖ్యత పెరిగిందని రిపోర్ట్ చెప్పింది. 2023లో భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి 55 శాతంగా ఉంది. అయితే ఇటీవలి మూడేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 199 మిలియన్లు పెరిగింది. భారతదేశంలో ఒక గిగాబైట్ (GB) డేటా ధర ప్రపంచంలోనే అతి తక్కువగా సగటున జీబీకి రూ.13.32గా ఉందని తెలిపింది.


ఓపెన్ నెట్‌వర్క్

దీంతోపాటు ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్‌మెంట్ నెట్‌వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్ సౌకర్యవంతమైన రుణాల కోసం పబ్లిక్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్ బలోపేతం అవుతోంది రిపోర్ట్ తెలిపింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (NBFC) లోన్ సర్వీస్ ప్రొవైడర్లుగా సహకరిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ఆ క్రమంలో డిజిటల్ రుణాలను సులభతరం చేయడానికి ప్లాట్‌ఫారమ్‌లను కూడా నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది.


వెబ్ సిరీస్‌

ఈ క్రమంలో అందుబాటు ధరల్లో ఆర్థిక సేవలను పొందేందుకు టెక్నాలజీ మరింత మెరుగుపడుతుందని గవర్నర్ అన్నారు. ఈ ఆవిష్కరణలన్నీ ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత సమర్ధవంతంగా, సమీకృతం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో RBI తన 90 ఏళ్ల ప్రయాణం గురించి ప్రజలకు తెలియజేయడానికి ఐదు ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్ సిరీస్ దాదాపు మూడు గంటల పాటు ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ 25-30 నిమిషాలు ఉండనుంది. 1935లో ఏర్పాటైన ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. వీటిని జాతీయ టీవీ ఛానెల్‌లు లేదా OTTలలో ప్రసారం చేసే అవకాశముంది.


ఇవి కూడా చదవండి:

Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే


Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 09:08 PM