Share News

Stock Market: తొలిసారి 80,000 క్లబ్‌లోకి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:51 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) బుధవారం (జూలై 3న) రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(sensex) తొలిసారిగా 80,000 స్థాయిని దాటగా, నిఫ్టీ(nifty) కూడా తొలిసారి 24,250 దాటింది. సెన్సెక్స్ 572 పాయింట్లు లాభపడి 80,013 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 24,291 వద్ద ఆరంభమైంది.

Stock Market: తొలిసారి 80,000 క్లబ్‌లోకి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా
stock market updates

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) బుధవారం (జూలై 3న) రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(sensex) తొలిసారిగా 80,000 స్థాయిని దాటగా, నిఫ్టీ(nifty) కూడా తొలిసారి 24,250 దాటింది. సెన్సెక్స్ 572 పాయింట్లు లాభపడి 80,013 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 24,291 వద్ద ఆరంభమైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 704 పాయింట్లు లాభపడి 52,872 వద్ద ప్రారంభమైంది. ఉదయం ప్రపంచ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు కనిపించిన నేపథ్యంలో సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. గిఫ్ట్ నిఫ్టీలో 125 పాయింట్ల పెరుగుదల కనిపించింది. నిన్న అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్, ఎస్‌అండ్‌పి రికార్డు స్థాయిలో ముగియగా, డౌ జోన్స్ 162 పాయింట్లు పెరిగింది.


హెచ్‌డీఎఫ్‌సీ రికార్డు..

ఈ క్రమంలోనే సెన్సెక్స్(sensex) మొదటిసారిగా 80 వేల మార్కును అధిగమించి 80,039 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ 169 పాయింట్లు పెరిగి 24,292 వద్ద తాజా గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంక్ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్‌గా ఉంది. దీంతో HDFC బ్యాంక్ షేర్ ధర 3% పైగా ర్యాలీ చేసి 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు బీఎస్‌ఈలో 3.54% పెరిగి తాజా గరిష్ట స్థాయి రూ. 1,791.90కి చేరాయి.


టాప్ గెయినర్స్, లూజర్స్

సెన్సెక్స్‌లో లాభపడిన జాబితా టాప్ 5లో HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ICICI బ్యాంక్, ఐషర్ మోటార్స్ ఉన్నాయి. ఇక టాప్ 5 నష్టాల కంపెనీల్లో TCS, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, HCL టెక్ ఉన్నాయి. ఈ క్రమంలోనే సూచీలలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం పెరిగింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.68 శాతానికి పైగా లాభపడింది. ఇక రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటి ఇండెక్స్ మినహా మిగిలినవన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మెటల్ టాప్ గెయినర్‌లలో ఉన్నాయి.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు

అదానీ షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ హస్తం

విద్యార్థుల కోసం ఐసీఐసీఐ సఫీరో ఫారెక్స్‌ కార్డ్‌


For Latest News and Business News click here

Updated Date - Jul 03 , 2024 | 11:09 AM