Share News

Hathras: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం.. నేడు సీఎం కూడా..

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:28 AM

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని హత్రాస్‌(Hathras)లో మంగళవారం ఘోర ప్రమాదం జరుగగా, ప్రమాదంలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందం(Forensic team) బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. డాగ్ స్క్వాడ్‌తో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Hathras: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం.. నేడు సీఎం కూడా..
Forensic experts at Hathras

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని హత్రాస్‌(Hathras)లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఫూల్రాయ్ గ్రామంలో భోలేబాబా ప్రవచన కార్యక్రమం కొనసాగుతుండగా ముగింపు కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన 121 మంది మృతి చెందారు. విపరీతమైన వేడిమికి వందలాది మంది భక్తులు స్పృహతప్పి పడిపోయారు. ప్రమాదం నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) విచారణకు ఆదేశించారు. డీజీపీ, హోంశాఖ కార్యదర్శి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.


ఫోరెన్సిక్ బృందం

ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందం(Forensic team) బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. డాగ్ స్క్వాడ్‌తో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈరోజు సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) కూడా హత్రాస్‌కు రానున్నారు. ఈ ప్రమాదంపై ఎడీజీ, ఆగ్రా, అలీఘర్ కమీషనర్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు చేయబడింది. వచ్చే 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు లక్ష్మీ నారాయణ్ చౌదరి, సందీప్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లు ఘటనా స్థలంలోనే ఉండాలని ఆదేశించారు.


సాయం ప్రకటన

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభలో ప్రధాని మోదీ కూడా ఈ ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని చెప్పారు. ఈ ఘటనపై యోగి, మోదీ, షా సహా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రధాని మోదీ(modi), సీఎం యోగి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50,000 సాయం అందజేస్తారు.


ఏది పరిపాలన

హత్రాస్‌ తొక్కిసలాటపై(Hathras stampede) సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ డాక్టర్‌ ఎస్‌టీ హసన్‌ స్పందించారు. ఇది చాలా విచారకరమని, ఇందులో చాలా మంది మరణించారని అన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందినవారేనని, పరిపాలన ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆరోపించారు. ఇది పరిపాలనా లోపమని, పూర్తిగా విచారణ జరగాలని కోరారు. ఈ ఘటలో ప్రమేయం ఉన్నవారికి కఠినమైన శిక్ష విధించాలని, వారికి జరిమానా విధించవచ్చా అనే దానిపై కూడా పరిశీలించాలని కోరారు.


ఇది కూడా చదవండి:

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు

యూపీలో సీట్లన్నీ మాకే వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్‌


Read Latest National News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 09:32 AM