Share News

Stock market: స్టాక్ మార్కెట్‌ క్రాష్.. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ముందుగానే తగ్గిస్తుందా..?

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:26 PM

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్(Stock market) భారీ పతనం తర్వాత అమెరికన్ సెంట్రల్ బ్యాంక్‌పై(US federal Bank) ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఊహించిన దానికంటే ముందుగానే తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వడ్డీ రేట్లను తగ్గించడంలో సెంట్రల్ బ్యాంక్ జాప్యం చేసిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Stock market: స్టాక్ మార్కెట్‌ క్రాష్.. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ముందుగానే తగ్గిస్తుందా..?
US federal Bank

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్(Stock market) భారీ పతనం తర్వాత అమెరికన్ సెంట్రల్ బ్యాంక్‌పై(US federal Bank) ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఊహించిన దానికంటే ముందుగానే తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వడ్డీ రేట్లను తగ్గించడంలో సెంట్రల్ బ్యాంక్ జాప్యం చేసిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. గత వారం ప్రారంభంలో ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానంలో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఆ క్రమంలో వడ్డీ రేటును 5.25 నుంచి 5.50 శాతం వద్ద కొనసాగించారు. ఈ క్రమంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వైఖరి దూకుడుగా ఉండవచ్చని మార్కెట్ పార్టిసిపెంట్లు అంటున్నారు. దీంతో సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల(interest rates) తగ్గింపు ప్రక్రియను ప్రారంభించవచ్చని అంటున్నారు.


వడ్డీ రేటును సగం

అమెరికాలో 1,14,000 కొత్త ఉద్యోగావకాశాలు మాత్రమే సృష్టించబడ్డాయని అమెరికా(america)లోని లేబర్ డిపార్ట్‌మెంట్ తన జులై నివేదికలో పేర్కొంది. ఇది ఊహించిన దానికంటే చాలా తక్కువ. ఈ కారణంగా, అమెరికాలో నిరుద్యోగ రేటు జూన్‌లో 4.1 శాతం నుంచి జులైలో 4.3 శాతానికి పెరిగింది. దీంతో ఉపాధి డేటా వచ్చిన తర్వాత వడ్డీ రేటు ఫ్యూచర్‌లు సెప్టెంబరులో వడ్డీ రేటును సగం శాతం తగ్గించే అవకాశం ఉంది. అయితే ఫెడరల్ రిజర్వ్ సమావేశం సెప్టెంబర్ 17-18 మధ్య జరగనుంది. అంతకుముందు సెప్టెంబర్‌లో నాలుగో వంతు తగ్గుతుందని అంచనా. ఫెడరల్ రిజర్వ్(US federal Bank) రాబోయే సమావేశాలలో వడ్డీ రేట్లలో(interest rates) నిరంతర తగ్గింపును గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. సిటీ గ్రూప్, JP మోర్గాన్ చేజ్ రెండూ సెప్టెంబర్, డిసెంబర్‌లలో వడ్డీ రేట్లలో సగం శాతం తగ్గింపును అంచనా వేసాయి.


ఏడాది కాలంగా

సెప్టెంబరు సమావేశానికి ముందే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని జేపీ మోర్గాన్ తెలిపింది. US ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఇటీవలి డేటా దృష్ట్యా, ఫెడరల్ రిజర్వ్ తన పాలసీలో మార్పులు చేయడంలో ఆలస్యం అవుతుందని సాధారణంగా మార్కెట్‌లో విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. గత వారం ప్రారంభంలో ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానంలో వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఆ క్రమంలో వడ్డీ రేటును 5.25 నుంచి 5.50 శాతం వద్ద కొనసాగించారు. ప్రస్తుత పరిస్థితి గురించి ముందే తెలిసి ఉంటే అప్పుడే వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించుకునేవారని ఇంకొంత మంది అంటున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపు చేయకూడదన్నారు. గత ఏడాది కాలంగా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఇదే స్థాయిలో కొనసాగిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 03:27 PM