Share News

Stock Market: మళ్లీ 80 వేల దిగువకు సెన్సెక్స్.. భారీ నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:01 PM

వారంలో చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ వారంలో రికార్డు స్థాయి లాభాలు ఆర్జించిన సూచీలు చివరి రోజు మాత్రం భారీ నష్టాల దిశగా పయనించాయి. అయితే చివర్లో కోలుకుని స్వల్ప నష్టాలతో బయటపడ్డాయి. సెన్సెక్స్ మళ్లీ 80 వేల దిగువకు చేరుకుంది.

Stock Market: మళ్లీ 80 వేల దిగువకు సెన్సెక్స్.. భారీ నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు!
Stock Market

వారంలో చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ వారంలో రికార్డు స్థాయి లాభాలు ఆర్జించిన సూచీలు చివరి రోజు మాత్రం భారీ నష్టాల దిశగా పయనించాయి. అయితే చివర్లో కోలుకుని స్వల్ప నష్టాలతో బయటపడ్డాయి. సెన్సెక్స్ మళ్లీ 80 వేల దిగువకు చేరుకుంది. నిఫ్టీ స్వల్ప లాభాన్ని నమోదు చేసింది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఈ అనిశ్చితి నెలకొంది. చివరకు సెన్సెక్స్ 53 పాయింట్ల స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది. (Business News).


గురువారం ముగింపు (80, 049)తో పోల్చుకుంటే దాదాపు 250 పాయింట్ల నష్టంతో 79, 778 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ చాలా సేపు నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 550 పాయింట్లకు పైగా కోల్పోయి 79, 478 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో మళ్లీ కోలుకుంది. చివరకు 53 పాయింట్ల స్వల్ప నష్టంతో 79, 996 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడింది. చివరకు 21 పాయింట్ల లాభంతో 24,323 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో లారస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ, అరబిందో ఫార్మా, గ్లెన్‌మార్క్, సెయిల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మెట్రోపోలిస్, వొడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 470 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 443 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.48గా ఉంది.

ఇవి కూడా చదవండి..

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. క్షణాల్లో 3 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు!


Gold and Silver Rate Today: మళ్లీ షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 05 , 2024 | 04:01 PM