Share News

Gold Rates: 70 వేల మార్క్ చేరిన బంగారం ధర

ABN , Publish Date - Aug 10 , 2024 | 07:07 AM

పెళ్లిళ్ల సీజన్ దగ్గరికి వచ్చేసింది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధరలు.. ఈ రోజు (శనివారం) నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవడంతో బంగారం ధరలు పెరిగాయి.

Gold Rates: 70 వేల మార్క్ చేరిన బంగారం ధర
Today Goldrates

హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ దగ్గరికి వచ్చేసింది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధరలు.. ఈ రోజు (శనివారం) నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవడంతో బంగారం ధరలు పెరిగాయి.


హైదరాబాద్‌లో ఇలా..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260కి చేరింది. నిన్నటితో పోలిస్తే రూ.770 పెరిగింది. ఈ రోజు రూ.64,260గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న 10 గ్రాముల ధర రూ.69,260గా ఉండగా ఈ రోజు రూ.70,100కి చేరింది. విశాఖపట్టణం, విజయవాడలో కూడా ఇదేవిధంగా బంగారం ధరలు ఉన్నాయి.


బంగారం ధర

10 గ్రాములు (22 క్యారెట్లు)

10 గ్రాములు (24 క్యారెట్లు)

హైదరాబాద్

64,260

70,100

విజయవాడ

64,260

70,100


ఢిల్లీలో ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగింది. నిన్న 63,640 ఉండగా ఈ రోజు రూ.64,410కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న రూ.69,410గా ఉండగా ఈ రోజు రూ.70,250కి చేరింది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.770 పెరిగింది. నిన్న రూ.63,490గా ఉండగా ఈ రోజు రూ. 64,260కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.840 పెరిగింది. నిన్న రూ.69,260 ఉండగా ఈ రోజు రూ70,100 పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.70,100గా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.88,100కి చేరింది.


విశాఖపట్టణం

64,260

70,100

ఢిల్లీ

64,410

70,250

చెన్నై

64,260

70,100

Updated Date - Aug 10 , 2024 | 07:07 AM