Pongal: సంక్రాంతి రోజున బ్యాంకులకు సెలవు ఉందా..? లిస్ట్ ఇదే..?
ABN , Publish Date - Jan 12 , 2024 | 06:05 PM
తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు పండగ సందడి ఉంటుంది. ఆ రోజుల్లో ప్రాంతాన్ని బట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది.
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి (Sankranti), కనుమ మూడు రోజులు పండగ సందడి ఉంటుంది. ఈ రోజుల్లో బ్యాంకులు తెరచే ఉంటాయా..? అనే ప్రశ్న వస్తుంది. అలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టత ఇచ్చింది.
జనవరిలో మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవు ఉంటాయి. ఇందులో 4 ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు మూసి ఉంటాయి. 13వ తేదీ భోగి పండగ వచ్చింది. ఈ రోజు రెండో శనివారం అయినందున బ్యాంకులకు సెలవు ఉంటుంది. 15వ తేదీ సోమవారం సంక్రాంతి పండగ నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, అసోంలో సెలవు ఉంటుంది. మిగిలిన రోజులు ప్రాంతాలను బట్టి సెలవు ఉంటుంది.
జనవరి 16వ తేదీ తమిళనాడులో బ్యాంకులకు సెలవు ఉంది. అక్కడ తిరువల్లువర్ డే జరుపుకుంటారు. 17వ తేదీన తమిళనాడు, చండీగఢ్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. 22వ తేదీన స్థానిక పండగ ఉండటంతో మణిపూర్‌లో బ్యాంకులను తెరవరు. 23వ తేదీన మణిపూర్‌లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. 25వ తేదీన తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని వాణిజ్య వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.