Share News

Hyderabad: బ్లాక్‌ మ్యాజిక్‌ పేరుతో మోసం చేస్తున్న బాబా అరెస్టు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 10:13 AM

బ్లాక్‌ మ్యాజిక్‌(Black magic) పేరుతో మోసాలకు పాల్పడుతూ.. రూ. లక్షల్లో కొల్లగొడుతున్న నకిలీ బాబా ఆటకట్టించారు సౌత్‌ఈస్టు టాస్క్‌ఫోర్స్‌ జోన్‌ పోలీసులు. బహదూర్‌పురాకు చెందిన మాజీ రౌడీషీటర్‌ మహ్మద్‌ ఖలీమ్‌ అలియాస్‌ ఖలీ వాల్‌ పెయింటింగ్‌ వర్క్‌ చేసేవాడు.

Hyderabad: బ్లాక్‌ మ్యాజిక్‌ పేరుతో మోసం చేస్తున్న బాబా అరెస్టు..

- చేతబడి చేసి అత్తామామలను అంతమొుందించాలని ఆశ్రయించిన మహిళ

హైదరాబాద్‌ సిటీ: బ్లాక్‌ మ్యాజిక్‌(Black magic) పేరుతో మోసాలకు పాల్పడుతూ.. రూ. లక్షల్లో కొల్లగొడుతున్న నకిలీ బాబా ఆటకట్టించారు సౌత్‌ఈస్టు టాస్క్‌ఫోర్స్‌ జోన్‌ పోలీసులు. బహదూర్‌పురాకు చెందిన మాజీ రౌడీషీటర్‌ మహ్మద్‌ ఖలీమ్‌ అలియాస్‌ ఖలీ వాల్‌ పెయింటింగ్‌ వర్క్‌ చేసేవాడు. సులభంగా డబ్బులు సంపాదనకు బ్లాక్‌ మ్యాజిక్‌ పేరుతో మోసాలకు తెరతీశాడు. ఈ క్రమంలో నజియా అనే మహిళ బాబా ఖలీని ఆశ్రయించింది. చేతబడి చేసి తన అత్తామామలను అంతమొందించాలని కోరింది.

ఈ వార్తను కూడా చదవండి: Bathukamma: ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ


అందుకు అంగీకరించిన బాబా.. కుంకుమ, పసుపు, అగర్బత్తీలు, గోధుమపిండి తదితర వస్తువులతో చేతబడి చేస్తున్నట్లు చూపించాడు. అయితే నజియా(Nazia) చేతబడి చేయిస్తున్నట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, బండ్లగూడ పోలీసులతో కలిసి చేతబడి చేస్తున్న సమయంలో నిందితుడు ఖలీతో పాటు.. నజియాను అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


...................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Amrapali: గుంతలు పూడ్చండి.. చెత్త తొలగించండి

city3.2.jpg

హైదరాబాద్‌ సిటీ: నగరంలో రోడ్ల పక్కన చెత్త కుప్పలు లేకుండా చూడాలని, ఇంటింటి చెత్త సేకరణను పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులకు సూచించారు. మంగళవారం చార్మినార్‌ జోన్‌ పరిధిలోని అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, ఆరాంఘర్‌, మీరాలంట్యాంక్‌, బహదూర్‌పుర(Attapur, Rajendranagar, Arangar, Miralantank, Bahadurpura) ప్రాంతాల్లో కమిషనర్‌ పర్యటించి రహదారులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, నిర్మాణ రంగ వ్యర్థాల కుప్పలు పేరుకుపోకుండా ప్రత్యేక వాహనాల్లో తరలించాలన్నారు.

city3.jpg


వ్యర్థాల పర్యవేక్షణకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

రహదారుల స్వీపింగ్‌ నుంచి ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం వరకు పర్యవేక్షణ కోసం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. మంగళవారం కమిషనర్‌ ఆమ్రపాలి పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై సమగ్ర వ్యర్థాల మెరుగైన నిర్వహణకు వినూత్న పరిష్కార మార్గాలు, ఐసీసీసీ నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వ్యర్థాల నిర్వహణ, సుస్థిరతకు సంబంధించి 11 కంపెనీల ప్రతినిధులు తమ వద్ద ఉన్న ప్రణాళికలు వివరించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు రఘుప్రసాద్‌, స్నేహ శబరీష్‌, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం

ఇదికూడా చదవండి: Mulugu: కాటేసిన పాము, కరెంటు!

ఇదికూడా చదవండి: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్‌

ఇదికూడా చదవండి: Investment Scam: స్టాక్‌ బ్రోకింగ్‌ పేరుతో.. ఘరానా మోసం!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2024 | 10:13 AM