Hyderabad: దొంగలున్నారు జాగ్రత్త.. నిర్మానుష్య ప్రదేశాల్లో జరభద్రం
ABN , Publish Date - Nov 29 , 2024 | 01:30 PM
బహిరంగ ప్రదేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు, వాహన దారులు లక్ష్యంగా కొందరు నేరస్తులు దారి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు కూకట్పల్లి(Kukatpally) పరిధిలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి.
- అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్న దొంగలు
- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు, వాహన దారులు లక్ష్యంగా కొందరు నేరస్తులు దారి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు కూకట్పల్లి(Kukatpally) పరిధిలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఎంత హెచ్చరించిన పట్టికీ అవగాహన లేకుండా రాకపోకలు సాగిస్తుండడంతో నేరస్తుల పాలిట వరంగా మారింది. ఈ నేరస్తులు అమాయక ప్రజలను రాత్రులు రోడ్లపై నిలువరించి బెదిరింపులకు పాల్పడుతూ నగదు బంగారం వస్తువులను కాజేస్తున్నానరు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పారిశుధ్య పనుల నిర్వహణ.. మరో 64 కి.మీ. ప్రైవేటుకు
కొన్నిసార్లు అడ్డు వచ్చిన వారిపై వస్తువులు ఇవ్వని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. కొన్ని ఘటనల్లో ట్రాన్స్‌జెండర్స్ సైతం ఈవిధమైన ఘటనలకు పాల్పడుతున్నారు. రోడ్లపై నిలబడి యువతను ఆకర్షించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్లను బెదిరించి డబ్బులు లాక్కుంటున్నారు. దోపిడీకి గురైన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా మరి కొందరు పరువు పోతుందని మిన్నకుండిపోతున్నారు.
ఘటనలు జరుగుతున్న ప్రాంతాలు
కేపీహెచ్‌బీకాలనీ నుంచి కైతలాపూర్ దారిలో రాత్రిపూట నిర్మానుష్యంగా ఉండడంతో దారి దోపిడీలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇటీవల వ్యభిచార వృత్తిలో ఉన్న ఓ మహిళను ఈ దారిలో హత్య చేశారు. పెట్రోలింగ్ వ్యవస్థ దృఢంగా లేకపోవడం, వీధి దీపాలు అంతంత మాత్రంగా ఉండడంతో చీకటి మయంగా ఉంటోంది.
- కేపీహెచ్‌బీ కాలనీ బస్‌స్టాండ్ నుంచి శాతవాహన కాలనీకి వెల్లే దారిలో నిర్మానుషంగా ఉండడంతో గత ఏడాది ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అదేలాగే అసాంఘిక కార్యకలాపాలకు ఈ రోడ్డు నెవలువుగా మారింది. మూడేళ్ల క్రితం ట్రాన్స్ జెండర్ల గొడవ కూడా ఈ ప్రాంతంలో జరిగి ఒకరిని హత్య చేశారు. ఇలాంటి రహదారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చీకటి పడితే ఈ దారుల నుంచి ప్రయాణం చేయకపోవడమే మేలని పలువురు చెబుతున్నారు.
- కేపీహెచ్‌బీ రోడ్డునెంబర్-1 నుంచి 5వ ఫేజ్ మీదుగా లోదా అపార్ట్‌మెంట్స్‌కు వెళ్లే రోడ్డులో ఇటీవల ఓ ద్విచక్ర వాహనదారుడిని బెదిరించి నలుగురు యువకులు సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఇదే వ్యక్తులు అదే రోజు మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్ లాక్కెళ్లారు.
నిఘా ఏర్పాటు చేస్తున్నాం
కూకట్పల్లి ఏసీపీ జోన్ పరిధిలో ఇప్పటికే పలు నిర్మానుష్య ప్రాంతాలను గుర్తించాం. రెండు రోజుల క్రితం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాన్స్‌జెండర్స్‌ను అదుపులోకి తీసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించాం. లోధా రోడ్డులోని ఉదాసీన్ మఠం వారికి నోటీసులు ఇచ్చి వారు ప్రహరీ నిర్మించుకునేలా సూచనలు ఇస్తాం. అదేవిధంగా గుర్తించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేస్తున్నాం. కాళీ స్థలాలు ఎక్కువగా ఉండి జన సంచారం ఉండే చోట పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచేలా సంబంధిత పోలీ్‌సస్టేషన్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.
- కె.శ్రీనివాసరావు, ఏసీపీ, కూకట్పల్లి
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..
ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!
ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్ ఫ్యాక్టరీ పూర్తి
ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్, కేటీఆర్‌లది నా స్థాయి కాదు
Read Latest Telangana News and National News