Share News

Hyderabad: నల్లటి దుస్తులు.. ముఖాలకు మాస్కులతో.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - May 21 , 2024 | 10:56 AM

నల్లటి దుస్తులు, ముఖాలకు మాస్క్‌లు ధరించి బైక్‌పై వచ్చిన అగంతకులు 10 నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడ్డారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేట(Ameerpet)లో ఉంటున్న ప్రైవేట్‌ ఉద్యోగి సురేష్‌ సోమవారం ఉదయం 5 గంటలకు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు వెల్‌నెస్‌ ఆస్పత్రి(Wellness Hospital) వద్ద చేతిలోని సెల్‌ఫోన్‌(Cell phone) లాక్కుని పారిపోయారు.

Hyderabad: నల్లటి దుస్తులు.. ముఖాలకు మాస్కులతో.. విషయం ఏంటంటే..

- పది నిమిషాల వ్యవధిలో రెండు చోరీలు

అమీర్‌పేట(హైదరాబాద్): నల్లటి దుస్తులు, ముఖాలకు మాస్క్‌లు ధరించి బైక్‌పై వచ్చిన అగంతకులు 10 నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడ్డారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేట(Ameerpet)లో ఉంటున్న ప్రైవేట్‌ ఉద్యోగి సురేష్‌ సోమవారం ఉదయం 5 గంటలకు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు వెల్‌నెస్‌ ఆస్పత్రి(Wellness Hospital) వద్ద చేతిలోని సెల్‌ఫోన్‌(Cell phone) లాక్కుని పారిపోయారు.

ఇదికూడా చదవండి: BRS: నాలుగు నెలలుగా వారికి జీతాలు లేవు: హరీష్ రావు


అనంతరం బల్కంపేటరోడ్డులోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మరో ఉద్యోగి రాజు చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని పోయారు. బాధితులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ చోరీలతో పాటు, 16 రోజుల క్రితం భరత్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద, అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పనిచేసే ఉద్యోగి వద్ద సెల్‌ఫోన్‌ లాక్కుని పారిపోయింది కూడా తామేనని విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు...


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 21 , 2024 | 10:56 AM