Share News

Hyderabad: ఏపీ నుంచి మహారాష్ట్రకు.. వయా హైదరాబాద్‌

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:26 AM

ఏపీ నుంచి మహారాష్ట్ర(AP to Maharashtra)కు వయా హైదరాబాద్‌ మీదుగా గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గరు అంత్రరాష్ట్ర స్మగ్లర్స్‌ను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు(Rachakonda SOT Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఏపీ నుంచి మహారాష్ట్రకు.. వయా హైదరాబాద్‌

- గంజాయి సరఫరా చేస్తున్న ముఠా

- ఆటకట్టించిన రాచకొండ పోలీసులు

- ఇద్దరు అంతరరాష్ట్ర స్మగ్లర్స్‌ అరెస్టు

- 60 కేజీల గంజాయి, కారు స్వాధీనం

- మొత్తం సొత్తు విలువ రూ. 35లక్షలు

హైదరాబాద్‌ సిటీ: ఏపీ నుంచి మహారాష్ట్ర(AP to Maharashtra)కు వయా హైదరాబాద్‌ మీదుగా గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గరు అంత్రరాష్ట్ర స్మగ్లర్స్‌ను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు(Rachakonda SOT Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్‌తో కలిసి సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్‌(Maharashtra Nashik)కు చెందిన వాల్మిక్‌ రూపా మోహితే అలియాస్‌ వాల్మిక్‌ తనకున్న మినీ లారీతో ఇతర ప్రాంతాలకు సామగ్రి తరలించే రవాణా వ్యాపారం చేస్తుండేవాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు..


అతడి బంధువు భటుదేవరం చవాన్‌ అలియాస్‌ భటు వాల్మిక్‌ వద్ద సహాయకుడిగా చేరాడు. భటుకు గంజాయి అలవాటుంది. ఆరు నెలల క్రితం వాల్మీక్‌ భటులు ఉల్లిగడ్డ లోడ్‌తో విశాఖపట్నం వెళ్లారు. అక్కడ తిరుపతి అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న భటు అతని వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవించాడు. గంజాయి గురించి, దాన్ని రవాణా చేస్తే వచ్చే లాభాల గురించి చర్చించేవాడు.

city6.2.jpg


రవాణా వ్యాపారంలో నష్టాలు రావడంతో..

కొద్దిరోజులుగా రవాణా వ్యాపారంలో నష్టాలు రావడంతో.. వాల్మీక్‌కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో గంజాయి రవాణా చేస్తే అధిక లాభాలు వస్తాయని తిరుపతి(Tirupati)తో మాట్లాడితే మంచి ఆఫర్స్‌ వస్తాయని భటు వాల్మీక్‌తో అన్నాడు. ఇదే మంచి అవకాశం అనుకున్న వాల్మీక్‌... తిరుపతితో మాట్లాడిన తర్వాత తన మినీ లారీని అమ్మేసి స్విఫ్ట్‌ కారు కొన్నాడు. ఆ తర్వాత తిరుపతి సహకారంతో గత కొంతకాలంగా ఏపీ నుంచి మహారాష్ట్ర(Maharashtra)కు గంజాయిని సరఫరా చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.


ఈ క్రమంలో ఈ నెల 25న భటు, వాల్మీక్‌లు కారులో పెందుర్తి వెళ్లారు. అక్కడ తిరుపతి సహకారంతో 60 కేజీల గంజాయిని సేకరించారు. 2 కేజీల చొప్పున ప్యాకింగ్‌ చేసి మొత్తం 30 ప్యాకెట్లను కారులో లోడ్‌ చేసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్‌ ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి బయలు దే ఓఆర్‌ఆర్‌ మీదుగా మహారాష్ట్ర వెళ్లేందుకు బయలుదేరారు. అప్పటికే గంజాయి రవాణాపై సమాచారం అందుకున్న రాచకొండ మహేశ్వరం జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఇబ్రహీంపట్నంలో స్థానిక పోలీసులతో కలిసి పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 60 కేజీల గంజాయి పట్టుకున్నామని, మొత్తం విలువు రూ. 35 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. గంజాయి సరఫరాదారుడు తిరుపతిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2024 | 11:26 AM