Hyderabad: అబ్బో.. కిలా(లే)డీ ముఠా.. కార్లను అద్దెకు తీసుకొని వారు చేసిన పనేంటో తెలిస్తే..
ABN , Publish Date - Dec 03 , 2024 | 11:06 AM
నగరంలోని కార్ల యజమానులకు టోకరా వేసి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ముఠా ఆటకట్టించారు రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police). మహిళా గ్యాంగ్ లీడర్ సహా.. ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.50కోట్ల విలువైన 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
- కిలా(లే)డీ ముఠా అరెస్ట్
- రూ. 2.50 కోట్ల విలువైన 21 కార్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: నగరంలోని కార్ల యజమానులకు టోకరా వేసి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ముఠా ఆటకట్టించారు రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police). మహిళా గ్యాంగ్ లీడర్ సహా.. ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.50కోట్ల విలువైన 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గచ్చిబౌలిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్(Madhapur DCP Vineeth) వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. పార్ట్‌టైం జాబ్ పేరుతో..
గచ్చిబౌలి టెలికాం నగర్‌కు చెందిన జూపూడి ఉష గృహిణి. ఆమె భర్త ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అనారోగ్య కారణాలతో కొంతకాలం క్రితం మృతి చెందాడు. సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేసిన ఆమె.. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన మల్లే్‌షతో కలిసి కార్ల దందాకు శ్రీకారం చుట్టింది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన సాగర్పాటిల్, భాల్కికి చెందిన జమానే అనిల్‌కుమార్‌తో ముఠాగా ఏర్పడ్డారు.
జీపీఎస్ తొలగించి..
కార్లను కిరాయికి తిప్పుతామని, నెలనెల అద్దె చెల్లిస్తామని తెలిసిన వారి ద్వారా ప్రచారం చేశారు. కొంతమంది కార్ల యజమానులను నమ్మించి 21 కార్లు అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత వాహనాలను కర్ణాటక రాష్ట్రం తరలించారు. కార్లకు అమర్చిన జీపీఎ్‌సను తొలగించి, యజమానుల వద్ద తీసుకున్న ధ్రువపత్రాలతో కర్ణాటకలోని పలు నగరాల్లో అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. కార్ల యజమానులకు అద్దె చెల్లించకపోవడంతో వారు నిలదీశారు. మీ వద్ద తీసుకున్న కారు చోరీ అయిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని, దొరకగానే కారుతోపాటు అద్దె చెల్లిస్తామని బురిడీ కొట్టించేవారు.
సంపాదించి.. అప్పులు తీర్చుకొని..
ఉష చెబుతున్న మాటలతో అనుమానం వచ్చిన కొంతమంది కార్ల యజమానులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ వినీత్ ఆదేశాలతో ఏసీపీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సతీష్ టీమ్ రంగంలోకి దిగింది. ఆమె ముఠాను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు మోసం వెలుగులోకి వచ్చింది. అద్దెకు తీసుకున్న కార్లను కర్ణాటకకు తరలించి అద్దెకు తిప్పుతూ నెలరోజుల్లోనే రూ. 60 లక్షలకు పైగా సంపాదించినట్లు తేలింది.
కార్ల యజమానులకు అద్దె ఇవ్వకుండా రూ. 20 లక్షల అప్పులు తీర్చుకుంది. ముఠాలో కీలకంగా వ్యవహరించిన డ్రైవర్ సొంతింటి నిర్మాణానికి ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కిలేడీ ముఠాను పట్టుకున్న రాయదుర్గం పోలీసులను సీపీ అవినాష్ మహంతి అభినందించారని డీసీపీ వినీత్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News