Share News

Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్‌.. బెడ్‌రూంలోకి దూసుకొచ్చిన బుల్లెట్‌

ABN , Publish Date - Jul 14 , 2024 | 11:29 AM

నార్సింగ్‌ పోలీస్‏స్టేషన్‌(Narsing Police Station) పరిధిలోని బైరాగిగూడలో తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఓ బుల్లెట్‌ కలకలం రేపింది. ఆ బుల్లెట్‌ ధాటికి ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌ కిటికీ అద్దాలు పగిలాయి.

Hyderabad: తుపాకీ మిస్‌ఫైర్‌.. బెడ్‌రూంలోకి దూసుకొచ్చిన బుల్లెట్‌

- నార్సింగ్‌లో కలకలం

హైదరాబాద్: నార్సింగ్‌ పోలీస్‏స్టేషన్‌(Narsing Police Station) పరిధిలోని బైరాగిగూడలో తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఓ బుల్లెట్‌ కలకలం రేపింది. ఆ బుల్లెట్‌ ధాటికి ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌ కిటికీ అద్దాలు పగిలాయి. బుల్లెట్‌ బెడ్‌రూమ్‌(Bedroom)లో పడిపోవడంతో ఫ్లాట్‌ యజమాని భయబ్రాంతులకు గురయ్యాడు. అయితే, ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఫ్లాట్‌లోని వారు ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలో ఉన్న ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌(Army Firing Range)లో జవాన్లు ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు పోలీసులు గమనించారు. మిస్‌ఫైర్‌ అయిన ఓ బుల్లెట్‌ అపార్ట్‌మెంట్‌లోకి దూసుకొచ్చినట్లు వారు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Social media: కొంప ముంచిన సోషల్‌మీడియా పోస్ట్‌..


city4.jpg

ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 11:29 AM