Hyderabad: సొంతిళ్లు నిర్మించుకోవాలని.. పనిచేస్తున్న ఇంటికే కన్నం
ABN , Publish Date - Nov 20 , 2024 | 10:25 AM
పొట్టకూటి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ముగ్గురు.. వారి సొంత ఇళ్లు నిర్మించుకోవాలనుకున్నారు. అందుకు తగినంత డబ్బులు లేకపోవడంతో ఏదైనా దొంగతనం చేసి డబ్బులు సంపాదించి ఊరిలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
- రూ. 10 లక్షల విలువై ఆభరణాలు చోరీ
- ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
- మొత్తం సొత్తు రికవరీ
హైదరాబాద్ సిటీ: బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి వాచ్మెన్(Watchman)గా పనిచేస్తున్న ముగ్గురు.. వారి సొంత ఇళ్లు నిర్మించుకోవాలనుకున్నారు. అందుకు తగినంత డబ్బులు లేకపోవడంతో ఏదైనా దొంగతనం చేసి డబ్బులు సంపాదించి ఊరిలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. తాము పనిచేస్తున్న ఇంటిపైనే కన్నేసి దొంగ తనానికి పాల్పడ్డారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం..
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మెట్రోస్టేషన్ల వద్ద ఆకతాయిలు..
తూర్పుగోదావరి జిల్లా ద్వారకాపురంకు చెందిన రేవు సురేష్, పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెం(Tadepalligudem)కు చెందిన అవిటి పల్లారావు, తూర్పుగోదావరి జిల్లా నేలపర్తిపాడుకు చెందిన తౌటి సుబ్బారావులు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-54లో పలు ఇళ్లలో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పరిచయం బాగా పెరిగి స్నేహితులయ్యారు. వారి వారి సొంత ఊరిలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
అయితే అవి పూర్తి చేయడానికి తగిన డబ్బులు లేకపోవడం, వచ్చే డబ్బులు ఎటూ సరిపోకపోవడంతో ఏదో ఒక దొంగతనం చేసి వచ్చిన డబ్బుతో ఊరిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వారు పనిచేస్తున్న ప్రాంతంలో అదును చూసి జూలై-18న ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రూ. 10లక్షల విలువైన గోల్డ్, డైమండ్, సిల్వర్ వస్తువులను చోరీ చేశారు.
వాటిని జూబ్లీహిల్స్ వెంకటగిరి(Jubilee Hills Venkatagiri) ప్రాంతానికి చెందిన యోగేష్ శాంతిలాల్ జైన్‌కు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొన్ని వస్తువులు అమ్మగా వచ్చిన రూ. 5లక్షల నగదు, మిగిలిని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కేసు దర్యాప్తు చేసిన క్రైమ్ అడిషనల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తన టీమ్‌తో రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..
ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు
Read Latest Telangana News and National News