Share News

Andhra Pradesh: ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా.. ఎక్కడంటే

ABN , Publish Date - Apr 15 , 2024 | 09:57 PM

శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. రాముడితో తెలుగు నేలకు విశేష అనుబంధం ఉంది. ఆ పేరు చెబితే చాలు తెలుగు లోగిళ్లు పులకిస్తాయి. భక్తితో నమస్కరిస్తాయి.

Andhra Pradesh: ధనస్సు ఆకారంలో అద్భుత రామాలయం.. మీరెప్పుడైనా ఈ గుడికి వెళ్లారా.. ఎక్కడంటే

శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. రాముడితో తెలుగు నేలకు విశేష అనుబంధం ఉంది. ఆ పేరు చెబితే చాలు తెలుగు లోగిళ్లు పులకిస్తాయి. భక్తితో నమస్కరిస్తాయి. రామయ్య మా వాడే అంటూ ఆప్యాయంగా హత్తుకుంటాయి. రఘునందనుడి కల్యాణంతో పాటు పట్టాభిషేక మహోత్సవం జరిగే శ్రీరామనవమికి ఆ సీతారామలక్ష్మణులను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఆ నీలమేఘశ్యామునిపై తమ భక్తిని ( Devotional ) పలు రకాలుగా చాటుకుంటుంటారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో శ్రీరాముడు తన కోదండం ఎక్కుపెట్టినట్టు నిర్మించిన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లేదారిలో విజయనగరం రైల్వే స్టేషన్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఎన్సీఎస్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించింది.


Health: అధికంగా వ్యాయామం చేయడమూ ముప్పే.. షాకింగ్ విషయాలు మీకోసం..

నారాయణం నరసింహ మూర్తి కోరిక మేరకు ఆయన కుమారులు నిర్మించారు. ఈ మందిరాన్ని గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు సహా పలువురు ప్రముఖులు 2014 మార్చి 22 న ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఆధ్యాత్మిక కట్టడం మంచి పర్యాటక ప్రదేశంగా ఆకర్షిస్తోంది. విల్లు ఆకారంలో నిర్మించి ఈ ఆలయంలో రామాయణంలోని 72 ఘట్టాలను 72 విగ్రహాలుగా చెక్కారు. ధనస్సు మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో వేదపాఠశాల సైతం నిర్వహిస్తున్నారు.


Congress: ఎన్నికల బాండ్లలో పట్టుబడినందుకే ఇంటర్వ్యూలు.. ప్రధాని పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు..

ఈ ఆలయాన్ని రెండంతస్థులుగా నిర్మించారు. బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల విగ్రహాలు ఉన్నాయి. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తున్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ రెండు విగ్రహాల దగ్గర ఫౌంటెన్ లు ప్రత్యేక ఆకర్షణ. మెట్లకు ముందు ఈ ఆలయాన్ని నిర్మించిన నారాయణం నరసింహమూర్తి విగ్రహం...పెద్ద పూలతోట ఉంటుంది. కింది అంతస్తులో అన్న ప్రసాద శాల, అల్పాహార శాల, గ్రంథాలయం, వేద పాఠశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, గోశాల ఉన్నాయి.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 09:57 PM