Share News

Diksuchi : ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:25 AM

ఇండియన్‌ ఆర్మీ... షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌

జాబ్‌ కార్నర్‌

ఇండియన్‌ ఆర్మీ... షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

  • ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 57వ కోర్సు

(ఏప్రిల్‌ 2025)

కేటగిరీ వారీగా ఖాళీలు

  • ఎన్‌సీసీ పురుషులు: 70 పోస్టులు

  • ఎన్‌సీసీ మహిళలు: 6 పోస్టులు

ఈ రెండు విభాగాల్లోనూ 8 పోస్టులను యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించారు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్‌లో కనీసం ‘బి’ గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సిసి ‘సి’ సర్టిఫికెట్‌ అవసరం లేదు.

వయోపరిమితి: 2025 జనవరి 1 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్ట్‌, స్టేజ్‌-1, స్టేజ్‌-2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ, వేతనాలు: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టయిపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదా నం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 9

వెబ్‌సైట్‌:joinindianarmy.ni c.in

Updated Date - Jul 19 , 2024 | 12:25 AM