AP SSC Results 2024: పదో తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?
ABN , Publish Date - Apr 22 , 2024 | 08:22 AM
పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇవాళ 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం రండి..
పదో తరగతి పరీక్షల ఫలితాలు (AP Tenth Results) మరో మూడు గంటల్లో రిలీజ్ కానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఫలితాలను (SSC Results) విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. పది పరీక్షా ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని.. 7లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ముందుగానే వచ్చేస్తున్నాయ్!
కాగా.. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిది వరకూ మూల్యాంకనం నిర్వహించారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాల వేల్యుయేషన్ కోసం 25 వేల మంది టీచర్లను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను నిర్వహించడం జరిగింది. దీంతో 22 రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేసి, ఇవాళ విడుదల చేస్తున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. గతేడాది కంటే.. ముందుగానే ఈసారి ఫలితాలు వచ్చేస్తున్నాయి.
ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
https:// results. bse.ap.gov.in/