Share News

TGPSC HWO Exam Date 2024: హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. షెడ్యూల్ ఇదే..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 02:23 PM

TGPSC HWO Exam Date 2024: గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. టీజీపీఎస్‌సీ పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సీ తెలిపింది.

TGPSC HWO Exam Date 2024: హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. షెడ్యూల్ ఇదే..!
TGPSC HWO Exam Dates

TGPSC HWO Exam Date 2024: గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. టీజీపీఎస్‌సీ పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సీ తెలిపింది. ఈ పరీక్షలను ప్రతి రోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఇక హాల్ టికెట్లను పరీక్షకు మూడు రోజుల ముందు వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్‌సీ అధికారులు తెలిపారు.


తెలంగాణలో ఉన్న గురుకుల విద్యా సంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు జనవరి 6, 2023 నుంచి జనవరి 27, 2023 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగగా.. పరీక్ష పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత.. నియామకాల విషయంలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీపీఎస్‌సీ ఎగ్జామ్ షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. కాగా, ఈ నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 581 పోస్టులను భర్తీ చేయనున్నారు.


పరీక్ష ఎలా ఉంటుందంటే..

ఈ పరీక్షలో మొత్తం 2 పెపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 సంబంధిత సబ్జెక్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

For More Education News and Telugu News..

Updated Date - Jun 17 , 2024 | 02:23 PM