Share News

CTET: సీ టెట్ కోసం ఇలా అప్లై చేయండి.. చివరి తేదీ ఎప్పుడంటే..

ABN , Publish Date - Sep 18 , 2024 | 01:50 PM

టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 సెషన్ కోసం ఇటివల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా, చివరి తేదీ ఎప్పడు, ఫీజు ఎంత అనే ఇతర వివరాలను ఇక్కడ చుద్దాం.

CTET: సీ టెట్ కోసం ఇలా అప్లై చేయండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
CBSE CTET 2024

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 2024 సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కూడా సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమైంది. దీని కోసం ctet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అక్టోబర్ 16, 2024 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 1 నుంచి 5 తరగతులకు, 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులు కావడానికి అర్హత కోసం CTET నిర్వహించబడుతుంది. CTETలో రెండు పేపర్లు ఉంటాయి.


దరఖాస్తు రుసుము

ఒక పేపర్‌ ప్రాథమిక పాఠశాలలకు (1 నుంచి 5వ తరగతి వరకు), మరో పేపర్‌ 6 నుంచి 8వ తరగతి వరకు ఉంటుంది. CTET పరీక్ష డిసెంబర్ 1, 2024న నిర్వహించబడుతుంది. పేపర్-2 ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, పేపర్-1 మధ్యాహ్నం 02:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 1000, రెండు పేపర్‌లకు రూ. 1200 చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 500, రెండో పేపర్‌లకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.


CTET అర్హత

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం CTET పేపర్-1లో హాజరు కావడానికి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు రెండేళ్ల D.El.Ed/నాలుగేళ్ల B. El.Ed కోర్సు చేయాలి. అయితే పేపర్-2 కోసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు B.Ed లేదా దానికి సమానమైన డిగ్రీ కల్గి ఉండాలి. CTETలో కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సుపై పరిమితి లేదు.


అప్లికేషన్ ప్రక్రియ

  • అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కావడానికి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

  • CTET 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inకి వెళ్లాలి

  • వెబ్‌సైట్‌లోని తాజా వార్తలలో CTET డిసెంబర్ 2024పై క్లిక్ చేయండి

  • ఆ తర్వాత మీరు కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను పూరించండి

  • దీని తర్వాత అభ్యర్థులు లాగిన్ ద్వారా మీ వివరాలను పూరించాలి

  • ఆ క్రమంలో మీ అర్హత, ID ప్రూఫ్, చిరునామా వంటి ప్రాథమిక వివరాలను అడుగుతారు

  • ఆ తర్వాత ఫోటో, సంతకం వివరాలను అప్‌లోడ్ చేయండి

  • దీని తర్వాత నిర్ణీత రుసుమును చెల్లించండి.

  • ఆ తర్వాత పూర్తిగా సమర్పించిన ఫారమ్ ప్రింటౌట్ తీసుకొని దానిని సురక్షితంగా ఉంచుకోండి


ఇవి కూడా చదవండి:

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Read MoreEducation News and Latest Telugu News

Updated Date - Sep 18 , 2024 | 01:52 PM