Share News

Lok Sabha Polls 2024: ముగిసిన ప్రచార పర్వం.. ఇక ఓటర్ల టైమ్..

ABN , Publish Date - May 11 , 2024 | 05:40 PM

సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Andhra Pradesh) ముగియడంతో.. రాష్ట్రం అంతా ప్రశాంతంగా మారింది. అధికార వైసీపీ ఒకవైపు..

Lok Sabha Polls 2024: ముగిసిన ప్రచార పర్వం.. ఇక ఓటర్ల టైమ్..
Lok Sabha Polls 2024

AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Andhra Pradesh) ముగియడంతో.. రాష్ట్రం అంతా ప్రశాంతంగా మారింది. అధికార వైసీపీ ఒకవైపు.. ఎన్డీయే కూటమి నేతలు ఒక వైపు అగ్రనేతలంతా తమ తమ ప్రచారంతో హోరెత్తించారు. తెలంగాణలోనూ 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ స్థానాల్లో ప్రధాన పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తించాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం.. నేటి సాయంత్రం 6 గంటలకు ఈ ప్రచారపర్వం ముగిసింది. స్థానికేతర నేతలు ఆయా ప్రాంతాల నుంచి తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.


సాయంత్రం నుంచి 144 సెక్షన్‌..

నెల రోజులుగా నిరాటంకంగా చేపట్టిన ప్రచారపర్వానికి తెరపడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారానికి అనుమతి లేదు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించటానికి వీల్లేదు. దీంతో 6 గంటల సమయం కాగానే, మైకులు, సౌండ్‌ బాక్సులు బంద్ అయ్యాయి. దీనికి విరుద్ధంగా జరిగితే క్షేత్రస్థాయిలో తిరుగుతున్న మైక్రో అబ్జర్వర్లు రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తారు. రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎన్నికల సంఘం బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు రాజకీయ పార్టీల నుంచి కానీ, రాజకీయ అభ్యర్థుల నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు కూడా ఉండకూడదు. బల్క్‌ మెసేజ్‌లు, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రకటనలు, సోషల్‌ మీడియా ప్రకటనలు అన్నీ బంద్ అయ్యాయి. ప్రింట్‌ మీడియాలో ప్రకటనలకు మాత్రం అనుమతి ఉంటుంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 11 , 2024 | 06:07 PM