Share News

ABN Big Debate: ఆరుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు నన్ను సంప్రదించారు: బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - May 07 , 2024 | 07:04 PM

తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ అతిథితో వీక్షకుల ముందుకొచ్చింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశిష్ఠ అతిథిగా విచ్చేశారు.

ABN Big Debate: ఆరుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు నన్ను సంప్రదించారు: బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Live News & Update

  • 2024-05-07T20:26:24+05:30

    Revanth-RK.jpg

    డిసెంబర్‌ 4న ఎస్‌ఐబీ కార్యాలయంలో వస్తువులను నాశనం చేశారు: రేవంత్ రెడ్డి

    • డిసెంబర్‌ 3 ఫలితాలు వచ్చాయి.. డిసెంబర్‌ 4న ఎస్‌ఐబీ కార్యాలయంలో వస్తువులను నాశనం చేశారు

    • దీనిపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది

    • కేసు దర్యాప్తులో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మేము కావాలని తీసుకువచ్చింది కాదు

    • తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ లేదు

  • 2024-05-07T20:23:57+05:30

    కేసీఆర్‌కు కొన్ని నమ్మకాలు కలిసి వచ్చాయి: రేవంత్‌ రెడ్డి

    • కేసీఆర్‌ను ఇప్పుడు ఎవరూ విశ్వసించడం లేదు

    • కేసీఆర్ తన డబ్బును కొందరి వ్యక్తుల దగ్గర దాచుకున్నారు

    • ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చేందుకు వాళ్లు ముందుకు రావడం లేదు

    • వాళ్లను బయపెట్టేందుకు 6నెలల్లో నేనే సీఎం అంటూ చెప్పుకుంటున్నారు

  • 2024-05-07T20:08:25+05:30

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆర్కే ‘బిగ్ డిబేట్’

  • 2024-05-07T20:03:10+05:30

    Revanth-Reddy-2.jpg

    ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చి దాడులు చేస్తున్నారు: రేవంత్‌

    • నన్ను ఢిల్లీకి రావాలంటూ నోటీసు కూడా ఇచ్చారు

    • ఎన్నికలు కాగానే ఢిల్లీకి వెళ్తా.. నన్ను అరెస్ట్‌ చేస్తారా?

    • సోషల్‌ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సీఎంని బాధ్యుడిని చేస్తారా?

    • పరిమితికి మించి రాజకీయ పార్టీలు వ్యవహరించడం మంచిది కాదు

    • బాధ్యతతో ప్రభుత్వాన్ని నడపాలని మేము అనుకుంటున్నాం

    • కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లాల్సిందే.. మేము అన్నింటికి అతీతులమని అనుకోవడం లేదు

    • కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవడం లేదు

    • మళ్లీ నియంతృత్వ పాలనను కావాలని ప్రజలు కోరుకోవడం లేదు

  • 2024-05-07T19:40:31+05:30

    పదేళ్లలో కేసీఆర్ సాధించలేనివి సాధించుకుంటూ పోతున్నాం: రేవంత్‌ రెడ్డి

    • కంటోన్మెంట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం... 194 ఎకరాల భూమిని బదలాయింపు చేశారు

    • కేసీఆర్‌కు నన్ను అనడానికి ఏం లేకపోవడంతోనే.. బీజేపీలోకి వెళ్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

    • నేను ఎలా పాలన చేస్తున్నానో ప్రజలు కూడా గమనిస్తున్నారు

  • 2024-05-07T19:30:42+05:30

    గ్రామాల్లో బీజేపీకి అంతగా ఉనికిలేదు: సీఎం రేవంత్‌ రెడ్డి

    • రూరల్‌లో పోటీ ఉన్నది బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే

    • బీఆర్ఎస్‌ నుంచి 100 ఓట్లు బయటకు పోతాయనుకుంటే.. అందులో 70 ఓట్లు కాంగ్రెస్‌ ఖాతాలోకి వచ్చేవే

    • డిసెంబర్‌ నుంచి మే7 వరకు 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చాం

    • కేసీఆర్ చేసిన అప్పుకు రూ.30వేల కోట్ల వడ్డీ కట్టాము

  • 2024-05-07T19:25:33+05:30

    • కేసీఆర్‌పై ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

    • తాను, తన కుటుంబం వల్లే ఫలితాలు వచ్చాయని కేసీఆర్ ఒప్పుకోవడం లేదు..

    • తెలంగాణ ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అంటున్నారు

    • బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులు ఆరుగురు నన్ను కలిశారు

    • నేను తలచుకుంటే బీఆర్ఎస్‌కు ఆరుగురు అభ్యర్థులు ఉండేవాళ్లు కాదు

    • స్థానిక సంస్థల ఎన్నికలు కొంతమేర బీఆర్ఎస్‌ను కాపాడుతున్నాయి.

  • 2024-05-07T19:19:42+05:30

    Untitled-5.jpg

    ఆరుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు నన్ను సంప్రదించారు

    ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా పోటీ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరుగురు బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులు తనను సంప్రదించారని అన్నారు. ‘మీరు చెబితే నామినేషన్ ఉపసంహరించుకుంటామని అన్నారు’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే అంతగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమీ లేకపోవడంతో తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం అన్నారు. తాను తలచుకుంటే ఆరు స్థానాల్లో బీఆర్ఎస్‌కు కనీసం అభ్యర్థులు కూడా ఉండేవారు కాదని అన్నారు. బీఆర్ఎస్ ఎంత నామమాత్రంగా పోటీ చేస్తుందో చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు.

    కేసీఆర్ బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా తాము చేయబోమని అభ్యర్థులు చెబుతున్నారంటే ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమని అన్నారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అహంకారం ఆ పార్టీకి ఉపయోగపడేలా కనిపించడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

  • 2024-05-07T19:13:21+05:30

    కేసీఆర్‌పై ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు.

  • 2024-05-07T19:11:12+05:30

    రేవంత్ రెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ. ఎన్డీయే-ఇండియా కూటమి తలపడుతున్నాయి. అన్ని పార్టీలు ఏదో ఒక కూటమిలో చేరాయి. ఈ రెండు కూటములు కాకుండా మిగిలింది ఓటర్లు మాత్రమే.

  • 2024-05-07T19:07:18+05:30

    • డిసెంబర్ 2023లో జరిగినవి సెమీ ఫైనల్ ఎన్నికలు

    • ఇప్పుడు జరగబోయేవి ఫైనల్ ఎన్నికలు

    • ఈ ఎన్నికల్లో గెలిస్తే ఛాంపియన్‌షిప్ కొట్టినట్టు

    • డిసెంబర్ 7న ఛార్జ్ తీసుకున్నాం.. మార్చి 17కి నోటిఫికేషన్ వచ్చింది

    • 4వ విడతలో మే 13న లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి

  • 2024-05-07T19:03:54+05:30

    తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ అతిథితో వీక్షకుల ముందుకొచ్చింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మరో 5 రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన రాజకీయ చర్చకు వచ్చాయి. ఆ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..

    కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నేపథ్యంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ పలువురు రాజకీయ నేతలతో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్, ఆ తర్వాత గుంటూరు ఎన్డీయే అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, అనంతరం నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు, తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డితో ఈ మధ్యే ‘బిగ్ డిబేట్’ నిర్వహించగా చక్కటి ఆదరణ లభించింది. టీవీ ఛానల్‌తో డిజిటల్ మాధ్యమాలైన యూట్యూబ్, వెబ్‌సైట్‌లలో భారీగా వీక్షించిన విషయం తెలిసిందే.