Home » Elections » Lok Sabha
వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి లీడ్‌లో దూసుకుపోతోంది. ఇండియా కూటమికి, ఎన్డీయేకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.
మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.
లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Election 2024) చివరిదైనా ఏడవ దశ పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. 8 రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న (శనివారం) పోలింగ్ జరగనుంది.
ఆమె సినిమా ‘క్వీన్’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ
లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు.. తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బుధవారం సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎదుటకు వచ్చింది.
పోలింగ్ బూత్‌లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.