Share News

Exit Poll: కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:44 AM

మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి.

Exit Poll: కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు
exit polls

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఏడో దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో లోక్ సభ పోలింగ్ ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఒక్కో సంస్థ ఎగ్జిట్ పోల్ ఒకలా ఉంటాయి. ఫలితాలకు దగ్గరలో కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఉంటాయి. జనం నాడీ స్పష్టంగా ఏ సంస్థ కూడా చెప్పడం లేదు. సీట్ల విషయంలో చాలా వరకు తేడా వస్తుంటాయి.


చివరి వరకు బ్యాన్

ఓటర్లపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఏడో విడత లోక్ సభ పోలింగ్ వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. లేదంటే మిగిలిన రాష్ట్రాల్లో ప్రభావం ఉంటుందని ఈసీ చెబుతోంది. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతుంది.


తప్పిన అంచనా

ఎగ్జిట్ పోల్స్ కొన్ని సందర్భాల్లో అంచనా తప్పుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో కరెక్టుగా ఉంటాయి. 1998, 2012, 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిజం అయ్యాయి. 2021లో కేరళలో ఎల్డీఎఫ్, బెంగాల్‌లో టీఎంసీ అధికారం చేపడతాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అంచనా నిజమైంది. కొన్ని సందర్భాల్లో అంచనాలు తప్పు తుంటాయి. 2004లో ఎన్డీఏ అధికారం చేపడుతుందని అంజనా వేశాయి. ఎన్డీఏ 181 సీట్లకు పరిమితమైంది. మెజార్టీ సీట్లు గెలుచుకున్న యూపీఏ అధికారం చేపట్టింది. 2024 లోక్ సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jun 01 , 2024 | 11:45 AM