Loksabha Polls: 8 సార్లు ఓటేసి, వీడియో తీసి.. ఏం జరిగిందంటే..?
ABN , Publish Date - May 20 , 2024 | 08:53 AM
పోలింగ్ బూత్‌లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.
లక్నో: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ (Mobile) తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు. వీడియో తీసి మరి ఓటు వేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈసీ ఆదేశాలతో ఎక్కువ ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్‌లో గల ఫరూకాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. అక్కడ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్‌కు రాజన్ సింగ్ అనే యువకుడు 8 సార్లు ఓటు వేశాడు. 2 నిమిషాలు నిడివి గల వీడియోలో లెక్క బెట్టి మరి ఓటు వేసిన విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏఆర్వో ప్రతీప్ త్రిపాఠి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువకుడిని అరెస్ట్ చేశారు.
సస్పెండ్
ఎక్కువ సార్లు ఓటేసిన ఘటనను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఓటు వేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. ఆ పోలింగ్ బూత్‌లో విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు స్పష్టం చేసింది.
For More National News and Telugu News..