Share News

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 02:28 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.

Lok Sabha Polls: ఎన్డీయేకు ఓటు వేయాలంటున్న ఇండియా కూటమి.. పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!
Pappu yadav

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌ (Bihar)లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.


ప్రస్తుతం పప్పు యాదవ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. తమకు ఓటు వేయకపోతే ఎన్డీయే కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రచారం చేస్తున్నారంటూ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పప్పు యాదవ్ ఇండియా కూటమి నుంచి టికెట్ ఆశించారు. పొత్తులో భాగంగా ఈసీటును ఆర్జేడీ తీసుకుంది. పప్పు యాదవ్ కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పప్పు యాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తేజస్వి యాదవ్‌పై పప్పు యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.

మీ ఇళ్లు, నగలు.. అన్నీ లాక్కుంటుంది!


తేజస్విపై సీరియస్..

తేజస్వి యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని పప్పు యాదవ్ సూచించారు. తేజస్వి తేలు లాంటి వాడని విమర్శించారు. రాహుల్ గాంధీ లక్ష్యం దేశ ప్రజలని.. తేజస్వి యాదవ్ లక్ష్యం మాత్రం కుర్చీ మాత్రమేనన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంపై ఆర్జేడీకి ఎటువంటి శ్రద్ధ లేదన్నారు. బీహార్‌లో బీజేపీని తేజస్వి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అద్దాల మేడలో ఉండి తన ఇంటిపై తాను రాళ్లు రువ్వే పనిని తేజస్వి యాదవ్ చేస్తున్నారంటూ పప్పు యాదవ్ విమర్శించారు. ప్రస్తుతం పూర్నియా స్థానంలో తమకు వేయకపోతే ఎన్డీయేకు ఓటు వేయాలని బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నారని.. దీన్నిబట్టి తేజస్వి యాదవ్ మనస్తత్వం అర్థమవుతుందన్నారు.


హాటెస్ట్ సీట్

బీహార్‌లోని పూర్నియా ప్రస్తుతం హాటెస్ట్ సీట్‌గా మారింది. ఇక్కడ ఎన్డీయే తరపున జేడీయూ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ సంతోష్ కుమార్ పోటీచేస్తున్నారు. ఇండియా కూటమి తరపున జేడీయూ నుంచి బీమా భారతి పోటీ చేస్తున్నారు. పప్పు యాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. పప్పు యాదవ్ పోటీతో ఆర్జేడీకి ఈ నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బంది పడుతోంది. దీంతో ఇండియా కూటమి కాకపోతే ఎన్డీయేకి వేయాలి తప్పా.. పప్పు యాదవ్‌కు వద్దని ఆర్జేడీ ప్రచారం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.


రెండో దశలో పోలింగ్

బీహార్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు రెండో దశలో (ఏప్రియల్ 26)న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పూర్నియా నియోజకవర్గం ఒకటి. ఈ నియోజవర్గం నుంచి పోటీ చేయాలని పప్పు యాదవ్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆర్జేడీని సంప్రదించగా.. సీటు ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి సీటు కోసం ప్రయత్నించారు. పొత్తులో కాంగ్రెస్‌కు పూర్నియా సీటు దక్కకపోవడంతో పప్పుయాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా బీమా భారతి పోటీ చేస్తున్నారు. తనను ఓడించడమే లక్ష్యంగా తేజస్వి యాదవ్ పని చేస్తున్నారని పప్పు యాదవ్‌ ఆరోపిస్తున్నారు. ఎన్డీయే అభ్యర్థిని గెలిపించేందుకు ఆర్జేడీ ప్రయత్నిస్తోందంటూ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.


ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ కొత్త వ్యూహాలు: రాహుల్‌

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National and Telugu News

Read Latest AP and Telangana News

Updated Date - Apr 23 , 2024 | 02:28 PM