Lok Sabha Polls:మూడో విడతలో ప్రముఖులు.. అమిత్ షా గట్టెక్కుతారా..!
ABN , Publish Date - May 06 , 2024 | 10:48 AM
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. మూడో దశలో అసోంలో నాలుగు, బీహార్‌లో ఐదు, ఛత్తీస్‌గఢ్‌లో ఏడు, గోవాలో రెండు, గుజరాత్‌లో 26, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమ బెంగాల్‌లో 4 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ఒకటి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.
Viral Video: కాంగ్రెస్ కార్యకర్త చెంప పగలగొట్టిన డిప్యూటీ సీఎం.. మండిపడుతున్న బీజేపీ
కీలక నేతలు..
మూడో దశలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, ఎన్సీపీ (ఎస్పీ) నేత, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇప్పటి వరకు రెండు దశల్లో పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 66.14 శాతం, ఏప్రిల్ 26న జరిగిన రెండో విడతలో 66.71 శాతం ఓటింగ్ నమోదైన విషయం తెలిసిందే.
ఈ నియోజకవర్గాల్లోనే పోలింగ్..
అస్సాం: ధుబ్రి, కోక్రాఝర్, బార్పేట, గౌహతి
బీహార్: ఝంజర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా
ఛత్తీస్‌గఢ్: జంజ్‌గిర్-చంపా, కోర్బా, సుర్గుజా, రాయ్‌ఘర్, బిలాస్‌పూర్, దుర్గ్, రాయ్‌పూర్
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ
గోవా: ఉత్తర గోవా, దక్షిణ గోవా
గుజరాత్: కచ్, బనస్కాంత, పటాన్, మహేసన, సబర్కాంత, గాంధీనగర్, అహ్మదాబాద్ ఈస్ట్, అహ్మదాబాద్ వెస్ట్, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్ బందర్, జామ్‌నగర్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్, ఆనంద్, ఖేడా, పంచమహల్, దాహోద్, వడోదర, ఛోటా ఉదయపూర్, భరూచ్, బర్దోలీ , నవ్సారి, వల్సాద్
కర్ణాటక: చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరె, షిమోగా
మధ్యప్రదేశ్: గుణ, సాగర్, విదిష, మోరెనా, భింద్, గ్వాలియర్, భోపాల్, రాజ్‌గఢ్, బేతుల్
మహారాష్ట్ర: బారామతి, రాయగడ, ధరాశివ్, లాతూర్, షోలాపూర్, మాధా, సాంగ్లీ, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనాంగ్లే
ఉత్తరప్రదేశ్: సంభాల్, హత్రాస్, ఆగ్రా ఫతేపూర్ సిక్రి, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, బదౌన్, అంబాలా, బరేలీ.
పశ్చిమ బెంగాల్: మాల్దా సౌత్, జంగీపూర్, మాల్దా నార్త్, ముర్షిదాబాద్
కీలక నేతలు ఎక్కడి నుంచి..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనాల్ పటేల్ పోటీచేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమిత్ షా ఇక్కడి నుంచి గెలుపొందారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా గుణ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ రావ్‌యాదవేంద్ర సింగ్ యాదవ్‌ను రంగంలోకి దింపింది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి ప్రతాప్ భాను శర్మను బరిలోకి దించింది.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మహారాష్ట్రలోని బారామతిలో ఇద్దరు కీలక నేతలు రెండు పార్టీల నుంచి పోటీచేస్తున్నారు. NCP (శరద్ పవార్) నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తుండగా.. ఎన్సీపీ నుంచి ఉప మఉక్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీచేస్తున్నారు.దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి జైవీర్ సింగ్, బిఎస్‌పి నుంచి శివప్రసాద్ యాదవ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధార్వాడ నుంచి పోటీ చేస్తున్నారు. కీలక నేతలు బరిలో ఉండటంతో అందరి దృష్టి మూడోవిడత ఎన్నికలపై పడింది.
Delhi: రాహుల్ గాంధీలో సత్తా లేదు: రాజ్‌నాథ్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For Latest News and National News click here