Share News

AP Election 2024: ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్.. షెడ్యూల్, రూట్ మ్యాప్ ఇదే

ABN , Publish Date - Apr 28 , 2024 | 08:24 PM

యువగళం సారధి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగబోతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 30) నుంచి ఆయన సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు నిర్వహించనున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లోకేశ్ తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు.

AP Election 2024: ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్.. షెడ్యూల్, రూట్ మ్యాప్ ఇదే

అమరావతి: యువగళం సారధి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగబోతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 30) నుంచి ఆయన సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు నిర్వహించనున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లోకేశ్ తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఈ మేరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారం రోజులపాటు సుడిగాలి పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైంది.

30న ఒంగోలు నుంచి లోకేశ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలవరకు యువతతో సాగే ముఖాముఖి సమావేశాల్లో యువతీయువకుల సందేహాలను లోకేష్ నివృత్తి చేస్తారు. యువగళం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ‘హలో లోకేశ్’ తరహాలో ఈ యువగళం సభలను కొనసాగించనున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 08:26 PM