Share News

Health: పొద్దున్నే పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే!

ABN , Publish Date - Jul 22 , 2024 | 09:11 PM

ఉదయాన్నే పరగడుపున గోరవెచ్చని నిమ్మరసం తాగితే పలు ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం, పీహెచ్ స్తాయి సమతౌల్యం, చర్మం నిగారింపు, జీవక్రియలు వేగవంతం కావడం తదితర ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Health: పొద్దున్నే పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే!

ఇంటర్నెట్ డెస్క్: శరీరంలోని విషతుల్యాలను తొలగించేందుకు నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. ఇది బరువు తగ్గించడంలో కూడా తోడ్పాటునందిస్తుంది. ఇక ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మరసం తాగితే బోలెడన్ని ఫలితాలు (Health) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

గోరువెచ్చని నిమ్మరసం జీవక్రియలను వేగవంతం చేస్తుంది. దీంతో, కెలొరీలు త్వరగా ఖర్చై బరువు నియంత్రణలో ఉంటుంది (Benefits of consuming warm lemon juice in the morning on empty stomach).

Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!


బైల్ జ్యూస్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేలా కాలేయాన్ని నిమ్మరసం క్రియాశీలకం చేస్తుంది.దీంతో, ఆహారం మరింత మెరుగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు, వేడి నీటి కారణంగా శరీరంలోని మలినాలన్నీ ఈజీగా తొలగిపోతాయి.

ఆకలి నిరోధించే గుణాలు నిమ్మరసంలో సహజసిద్ధంగా ఉంటాయి. దీంతో, కడుపు నిండుగా ఉన్న భావన కలిగి మనసు ఆహారం వైపు మళ్లదు. అంతిమంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

బరువు తగ్గేందుకు తగినంత నీరు తాగడం కూడా కీలకం. ఇక చాలా సందర్భాల్లో దాహం కారణంగా ఆకలేస్తున్నట్టు అనిపించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి, ఉదయాన్నే నిమ్మరసంతో ప్రారంభిస్తే శరీరానికి తగినంత తేమ లభిస్తుంది.


శరీరంలో పోగుపడ్డ విషతుల్యాలను తొలగించడంలో నిమ్మరసానికి మించినది లేదు. దీన్ని సహజసిద్ధ డీటాక్సిఫయ్యర్‌గా పిలుస్తారు. క్రమం తప్పకుండా నిమ్మరసం తాగితే శరీరంలో విషతుల్యాలు పేరుకోవు. జీవక్రియలు మరింత సమర్థవంతంగా జరిగి బరువు నియంత్రణలో ఉంటుంది.

మనసును ఉత్తేజపరిచి, శక్తిని పెంచే సామర్థ్యం కూడా నిమ్మరసానికి ఉంది. అతిగా తినేందుకు కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలు కూడా నిమ్మరసం తగ్గించగలదు. ఇక నిమ్మరసంలోని విటమిస్ - సీకి ఉన్న యాంటీఆక్సిడెంట్ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి శరీరానికి స్వస్థత చేకూరుస్తాయి.

రోగనిరోధక శక్తి బలోపేతానికి, శరీరంలో ఆమ్ల-క్షార గుణాల మధ్య సమతౌల్యానికి కూడా నిమ్మరసం కీలకం. ఇక బరువు తగ్గేకొద్దీ చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గి కొత్త మెరుపు సంతరించుకుని ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Read Health and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 09:14 PM