Share News

Curd: ఈ విషయాలు తెలిస్తే ఇక ఎన్నడూ పెరుగు లేకుండా భోజనం ముగించరు!

ABN , Publish Date - Nov 29 , 2024 | 07:10 PM

పెరుగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్న నిపుణులు రోజూ కచ్చితంగా దీన్ని తినాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Curd: ఈ విషయాలు తెలిస్తే ఇక ఎన్నడూ పెరుగు లేకుండా భోజనం ముగించరు!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయుల ఆహారంలో పెరుగు ఓ ముఖ్య భాగం. అయితే, ఆధునిక యుగంలో చాలా మంది పెరుగు ప్రయోజనాలను మర్చిపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్‌లకు కొందరు అలవాటు పడుతుంటే మరికొందరు పెరుగు తినకుండానే భోజనం ముగించేస్తున్నారు. అయితే, పెరుగుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్న నిపుణులు రోజూ కచ్చితంగా దీన్ని తినాలని సూచిస్తున్నారు (Health).

Mosquito Repellent: మస్కిటో రిపెలెంట్స్ హానికరమా? వైద్యులు చెప్పిన సమాధానం ఇదే!


గుండెకు మేలు..

పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం, పెరుగుతో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్టెరాల్, బీపీ నియంత్రణ మొదలు బరువు అదుపులో ఉండటం వరకూ ఎన్నో ఉన్నాయి. పెరుగుతో సహా పులియబెట్టిన డెయిరీ ఉత్పత్తులతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందట. పెరుగుతో బీపీ, కొలెస్టెరాల్ స్థాయిలో నియంత్రణలోకి వచ్చి గుండె ఆరోగ్యం గణీయంగా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎముకలు, పళ్ల దృఢత్వం

పెరుగులో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం, పెరుగులో సమృద్ధిగా లభించే ఈ మినరల్స్‌తో బోలు ఎముకల వ్యాధి దరిచేరదు.

Hairloss: జుట్టూడిపోతోందా? ఈ లిమిట్ దాటనంత వరకూ టెన్షన్ వద్దు!

బరువుపై నియంత్రణ

జర్నల్‌ ఆఫ్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, పెరుగుతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. పెరుగులో ఉన్న అధిక ప్రొటీన్ల కారణంగా కడుపు చాలా సేపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫలితంగా, ఆహారం తక్కువగా తీసుకుంటారు. అంతేకాకుండా పెరుగుతో జీవక్రియలు కూడా వేగవంతమవుతాయి. ఈ రెండిటి ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది.

జీర్ణవ్యవస్థకూ మేలు..

జీర్ణవ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియాను ప్రోబయోటిక్స్ అంటారు. శరీరం సమర్థవంతంగా పోషకాలు గ్రహించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. తరచూ పెరుగు తినే వారికి ఆహారం సమర్థవంతంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా, కడుపుబ్బరం, మలబద్ధకం, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటివన్నీ తొలగిపోతాయి.


Instant Coffee - Cancer: ఇన్‌స్టెంట్ కాఫీ అతిగా తాగితే క్యాన్సర్ వస్తుందా?

పెరుగులోని ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తికి కూడా బలోపేతం చేస్తాయి. వీటితో యాంటీబాడీల ఉత్పత్తి క్రీయాశీలకమవుతుంది. ఫలితంగా, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఒనగూడుతుంది. పెరుగుతో శరీరంలోని ఇతర రక్షణ వ్యవస్థలు కూడా బలోపేతమై రోగకారక సూక్ష్మక్రిముల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.

పెరుగులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టు ఆరోగ్యానికీ ఎంతో కీలకం. రోజూ పెరుగు తినే వాళ్లల్లో జుట్టు కుదుళ్లు బలోపేతమై వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా కాంతివంతంగా మారుతుంది.

పెరుగులోని ప్రొటీన్లు, కొవ్వుల కారణంగా ఆహారంలోని కార్బోహైడ్రేట్లు మెల్లగా జీర్ణం అవుతాయి. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజ్ మెల్లగా విడుదలై చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి. కాబట్టి, పెరుగు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌కు ఇది అత్యంత కీలకమని అంటున్నారు.

Latest and Health News

Updated Date - Nov 29 , 2024 | 07:14 PM