Share News

Nutmeg: మీ చర్మం నిగారింపు తగ్గిందా? ఇది ట్రై చేస్తే రిజల్ట్ పక్కా!

ABN , Publish Date - Jul 25 , 2024 | 07:29 PM

కాలుష్యం కారణంగా నిగారింపు తగ్గిన చర్మానికి మంచి జాజికాయ పాక్స్ చక్కని ఔషధమని ఆయుర్వేదం చెబుతోంది. మరి జాజికాలో ఉన్న ఔషధాలు ఏమిటో, దీన్ని ఎలా వాడుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Nutmeg: మీ చర్మం నిగారింపు తగ్గిందా? ఇది ట్రై చేస్తే రిజల్ట్ పక్కా!

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో కాలుష్యం బారిన పడని వాళ్లంటూ ఉండరు. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో మహిళలు కూడా సుదూర ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో, దుమ్మూధూళి కాలుష్యం కారణంగా చర్మం నిగారింపు కోల్పోతుంది. జీవం లేనట్టు అందవిహీనంగా కనిపిస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో చర్మసౌందర్యం తిరిగిపొందేందుకు ఆయుర్వేదం అనేక చికిత్సలు సూచించింది. ముఖ్యంగా జాజికాయతో చర్మానికి అనేక ప్రయోజనాలు (Health) చేకూరుతాయని చెబుతోంది. దీన్ని పేస్టులా చేసి ముఖ్యానికి రాసుకుంటూ చర్మం కాంతులీనుతుందట. మరి జాజికాయ ఔషధ గుణాలు ఏంటో? దీన్ని చర్మ చికిత్సలో ఎలా వాడాలో తెలుసుకుందాం.

Health: చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?


జాజికాయలో అనేక బ్యాక్టీరియా నిరోధక గుణాలు ఉన్నాయట. దురదలు, పింపుల్స్, యాక్నే వంటి సమస్యలకు జాజికాయ అద్భుతమైన పరిష్కారం

జాజికాయ చర్మాన్ని శుభ్రపరిచి రంగు పెరిగేలా చేస్తుంది. దీన్ని పాలు లేదా నూనెతో కలిపి ముఖానికి రాసుకుంటే నల్లటి చారలన్నీ తొలగిపోతాయి.

చర్మం ఎండినట్టు ఉండి ఇబ్బందులు పడుతున్న వారికి జాజికాయతో మంచి ఉపశమనం లభిస్తుంది. దీని పేస్టును పూసుకుంటే చర్మానికి తగినంత తేమ అంది కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.

వృద్ధాప్యం కారణంగా చర్మంపై కనిపించే ముడతలు, నల్లని చారలు కూడా జాజికాయతో తొలగిపోతాయి. చర్మం సహజసిద్ధంగా జీవకళ సంతరించుకుంటుంది.

1.jpgచర్మంపై ఉన్న మృతకణాలను కూడా తొలగించగలదు. కళ్లకింద ఉన్న నల్లని వలయాలు కూడా జాజికాయతో తొలగిపోతాయి. కళ్లకింద నల్లని మచ్చలు కూడా పోతాయి.

జాజికాయలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మంపై ఇన్‌ఫ్లమేషన్ తాలుకు ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో, చర్మం కాంతివంతంగా యవ్వనంగా మారుతుంది.

Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!


జాజికాయను ఉపయోగించడం ఇలా..

జాజికాయను ముందుగా పొడి చేసి ఆ తరువాత దానికి కొద్దిగా తేనె, పాలు లేదా యూకలిప్టస్ ఆయిల్ జత చేయాలి. ఆ తరువాత ఈ పేస్టును ముఖానికి రాసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం మంచినీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే చర్మంలో నలుపు రంగుకు కారణమయ్యే మెలనిన్ తగ్గి నిగారింపు వస్తుంది. యూవీ కిరణాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. జాజికాయ పొడితో నిమ్మరసం, పెరుగు, లేదా దాల్చిన చెక్క పొడిని కలపి వివిధ రకాల ప్యాక్స్ తయారు చేసి ముఖానికి రాసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఒనగూడుతాయి. చర్మంపై ఇతరత్రా నల్లటి ప్రాంతాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి.

Read Health and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 07:32 PM