Share News

Back Pain Relief: బ్యాక్ పెయిన్, ఒంటి నొప్పులు తగ్గాలంటే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలపండి

ABN , Publish Date - Nov 20 , 2024 | 08:01 PM

రోజంతా అలసిపోయిన శరీరానికి డీటాక్సిఫికేషన్ ఎంతో అవసరం అది స్నానం వల్లే లభిస్తుంది. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలిపితే ఎన్నో ప్రయోజనాలున్నాయి..

Back Pain Relief: బ్యాక్ పెయిన్, ఒంటి నొప్పులు తగ్గాలంటే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కలపండి
Bathing

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో శరీరంపై ఉండే మాలిన్యాలను తొలగించడం కూడా అంతే అవసరం. ఇందుకోసం స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ గళ్లుప్పును వేసుకుంటే ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇది స్వేద గ్రంథులను తెరుచుకునేలా చేసి అందులోని మురికిని బయటకు వెళ్లేలా చేస్తుంది. అంతే కాదు రోజంతా పనితో అలసిపోయిన శరీరానికి ఉప్పు నీటి స్నానం మ్యాజిక్ లా పనిచేస్తుంది.


ఇన్ఫెక్షన్లు దరిచేరవు..

ఉప్పు నీటిలోని పోషకాలు.. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. అనేక రకాలైన బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరుపును ఇస్తుంది. అందుకు ఈ నీటిలో ఉండే మినరల్సే కారణం. చర్మవ్యాధులైన ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా సాల్ట్ వాటర్ బాత్ ను ట్రై చేయాలి. దీని వల్ల చర్మంపై దురద, పొక్కుల వంటి రాకుండా నిరోధిస్తుందని నిపుణులు అంటున్నారు.


కీళ్ల నొప్పులు పరార్..

ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కీళ్ల వాపు, నొప్పులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే కీళ్ల వద్ద రక్త ప్రసరణను మెరుగుపడుతుందని అంటున్నారు. కీళ్లకు సంబంధించిన వాతం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే ఉప్పు నీటి స్నానం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా త‌గ్గించుకోవ‌చ్చంటున్నారు.


వర్క్ స్ట్రెస్ తగ్గిస్తుంది..

ఉద్యోగంలో భాగంగా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం.. అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు వంటి కారణంగా కండరాలు, కీళ్లు, శరీరంలోని వివిధ భాగాల్లో తీవ్ర నొప్పులు వస్తుంటాయి. దీంతోపాటు చాలా మందిలో అలసట, బద్ధకం, నిద్రలేమి కూడా వేధిస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్..

కండరాల నొప్పుల నుంచి బయటపడాలంటే ఉప్పు నీటి స్నానం బెస్ట్ ఆప్షన్. కండరాల ఒత్తిడిని తగ్గించడంలో ఈ వాటర్ బాగా పనిచేస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఉప్పు వేసిన నీటిలో గురుత్వాకర్షణ తగ్గుతుంది. అది కీళ్లు, కండరాలు, ఒంటిపై ఒత్తిడిని తగ్గించి నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది.

Palmyra Sprouts: చలికాలంలో మాత్రమే దొరికే సూపర్ ఫుడ్.. ఇవి కనిపిస్తే అస్సలు వదలకండి


Updated Date - Nov 20 , 2024 | 08:02 PM