Share News

Jammi Tree: జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:54 PM

దసరా పర్వదినాన బంధువులు, స్నేహితులంతా ఒక చోట చేరి జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. జమ్మి చెట్టు లేదా శమీ వృక్షం ఆకులను బంగారం అంటారు.

Jammi Tree: జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు

ఇంటర్నెట్ డెస్క్: దసరా పర్వదినాన బంధువులు, స్నేహితులంతా ఒక చోట చేరి జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. జమ్మి చెట్టు లేదా శమీ వృక్షం ఆకులను బంగారం అంటారు. రామాయణంలో రాముడు లంకకు వెళ్లేముందు ఈ మొక్కను పూజించాడు. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు ఆయుధాలను జమ్మీ చెట్టు మీద పెట్టి పూజిస్తారు. అది పూర్తయ్యాక వారి ఆయుధాలను తీసుకుని యుద్ధానికి వెళ్తారు. అందుకే జమ్మి చెట్టును విజయదశమి నాడు పూజిస్తే అపజయాలు కలగవని భక్తుల నమ్మకం. అయితే ఆయుర్వేదం ప్రకారం.. జమ్మి చెట్టుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జమ్మీ చెట్టు కాండం, ఆకులు, పుష్పాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.

1. నోటి అల్సర్లు..

జమ్మి చెట్టు కాండాన్ని నీటిలో వేడి చేసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుందట. పంటి నొప్పి సమస్య ఉన్నవారికీ ఇది ఉపశమనాన్నిస్తుంది. నోటి అల్సర్లనూ తగ్గిస్తుంది. జమ్మి చెట్టు కాండం నుంచి ఎండిన పొడిని తీయవచ్చు. కాండాన్ని చూర్ణం చేసి వివిధ రకాల జబ్బులకు మందులా వాడతారు.

2. ఎలర్జీలకు..

జమ్మిచెట్టు ఆకులను ముద్దలాగా చేసి చర్మం మీద రాసుకుంటే స్కిన్ ఎలర్జీలు తగ్గిపోతాయి. చర్మంపై వచ్చే దురద, మంట నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


3. అవాంఛిత రోమాలకు..

చాలా మందికి అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడతారు. అలాంటి సమయంలో జమ్మిచెట్టు పండు లేదా కాయను నూరి క్రమం తప్పకుండా రాసుకుంటే సమస్య తగ్గుతుంది.

4. కాలుష్యాన్ని గ్రహించి..

జమ్మి చెట్టును ఎయిర్ ప్యూరిఫైయర్ అనుకోవచ్చు. ఇది గాలిలో ఉండే హానికర కాలుష్య కారకాలను గ్రహించి గాలిని శుద్ధి చేస్తుంది. జమ్మి చెట్టును ఇంటి బాల్కనీలోనూ పెంచుకోవచ్చు. సూర్యరశ్మి ఎక్కువగా ఉండే చోట నల్లమట్టిలో ఈ మొక్కను పెంచవచ్చు.

ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్‌’ పెట్టాలి

ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్‌ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్‌ పేరు

ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు

ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2024 | 03:55 PM