Viral News: ఈ చిత్రంపై నెటిజన్ల హాస్యం.. సోషల్ మీడియాలో వైరల్
ABN , Publish Date - Aug 06 , 2024 | 02:56 PM
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కొన్ని పండ్లు కనిపిస్తున్నాయి. దానికి నవ్వడమేంటి అనుకుంటున్నారా. షీతల్ యాదవ్ అనే భారతీయ మహిళ "ప్రొటీన్ ఫుల్ డైట్" అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో కొన్ని పండ్లు ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కొన్ని పండ్లు కనిపిస్తున్నాయి. దానికి నవ్వడమేంటి అనుకుంటున్నారా. షీతల్ యాదవ్ అనే భారతీయ మహిళ "ప్రొటీన్ ఫుల్ డైట్" అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో కొన్ని పండ్లు ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. అయితే ఆమె పెట్టిన క్యాప్షన్‌పైనే నెటిజన్లు తెగ జోకులేసుకుంటున్నారు.
ప్లేట్‌లో రెండు యాపిల్ ముక్కలు, అరటిపండు, మొలకలు, నాలుగు బాదం, రెండు వాల్‌నట్‌లు, రెండు ఖర్జూరాలు ఉన్నాయి. అయితే వీటిల్లో ప్రొటీన్లు చాలా తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. అయితే షీతల్ యాదవ్ అనే మహిళ షేర్ చేసిన ఈ చిత్రానికి క్యాష్షన్‌లో.. ఆ పండ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పడం చర్చనీయాంశం అయింది. నిజానికి చిత్రంలో చూపిన ఆహార పదార్థాల్లో ఫైబర్‌తోపాటు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
ఈ పొరపాటును గమనించకుండా సదరు మహిళ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆమె అధికారిక ఎక్స్ బయో ప్రకారం.. అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.శీతల్ యాదవ్ శనివారం ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్‌తోపాటు, లెక్కలేనన్ని కామెంట్స్ పోస్ట్‌కి వచ్చాయి. స్వీడిష్ వైద్యుడు ఆండ్రియాస్ ఆ పోస్ట్‌లోని ఇమేజ్‌లో ప్రొటీన్లు ఎక్కువగా లేవని తెలిపారు. "ఫొటోలో చూపిస్తున్న పండ్ల మొత్తంలో15 గ్రాముల ప్రొటీన్, పిండి, కొవ్వు పదార్థాలు ఉన్నాయి. ఇది చాలా తక్కువ ప్రొటీన్లు అందించే ఆహారం. వీటిని తింటే 8 శాతం ప్రొటీన్ శరీరానికి అందుతుంది. ఈ ప్లేట్‌లో దాదాపు 15.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది(అరటిపండు: 1.5 గ్రా, బాదంపప్పులు: 0.8 గ్రా, వాల్‌నట్‌లు: 0.8 గ్రా, 1/4 ఆపిల్‌లో 0.1గ్రా, పెసళ్ల మొలకలు (50గ్రా) : 12గ్రా, ఖర్జూరం: 0.5గ్రా) ఈ ప్రొటీన్ నుంచి దాదాపు 15 శాతం శక్తి కేలరీల రూపంలో అందుతుంది. కానీ దీన్ని అధిక ప్రొటీన్‌గా పరిగణించరు" అని ఆండ్రియాస్ చెప్పారు.
లూసిన్ తక్కువగా ఉన్న పదార్థం..
ఆ పోస్ట్‌ని చూసిన మరో నెటిజన్ "ఈ ప్లేట్‌లో ప్రోటీన్‌లు తక్కువగా ఉన్నాయి. మొలకల్లోని కొన్ని గ్రాములు తప్ప, ఇందులో ఎలాంటి ప్రొటీన్‌లు ఉండవు. ఈ పండ్లలో లూసిన్(ప్రొటీన్ లో వుండే అమైనో ఆమ్లము) కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. శాకాహారులు అధికంగా ప్రొటీన్ పొందాలంటే పెరుగు లేదా పాల ఉత్పత్తులను తరచూ తీసుకోవాలి" అని కామెంట్ చేశాడు.
For Latest News and National News click here