Share News

Climate Change: నవజాత శిశువులపై వాతావరణ మార్పు ప్రభావం.. వేడి గాలులకు 1,75,000 మంది శిశువుల మరణం

ABN , Publish Date - Jul 07 , 2024 | 02:56 PM

అప్పుడే పుట్టిన శిశువులపై వాతావరణ మార్పులు(Climate Change) ప్రభావంత పడుతోందని పోట్స్‌డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (PIK), జర్మనీ అంతర్జాతీయ పరిశోధకుల బృందం వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాల్లో 29 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో సర్వే జరపగా.. నవజాత శిశువుల మరణాల్లో నాలుగు శాతానికి పైగా వాతావరణ మార్పుల ప్రభావంతోనేనని తేలింది.

Climate Change: నవజాత శిశువులపై వాతావరణ మార్పు ప్రభావం.. వేడి గాలులకు 1,75,000 మంది శిశువుల మరణం

ఇంటర్నెట్ డెస్క్: అప్పుడే పుట్టిన శిశువులపై వాతావరణ మార్పులు(Climate Change) ప్రభావంత పడుతోందని పోట్స్‌డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (PIK), జర్మనీ అంతర్జాతీయ పరిశోధకుల బృందం వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాల్లో 29 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో సర్వే జరపగా.. నవజాత శిశువుల మరణాల్లో నాలుగు శాతానికి పైగా వాతావరణ మార్పుల ప్రభావంతోనేనని తేలింది.

2001 - 2009 మధ్య కాలంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 1.5 శాతం శిశువుల మరణాలు తీవ్రమైన వేడి గాలులతో సంభవించినట్లు అధ్యయనం గుర్తించింది. మిగతా 3 శాతం మరణాలు తీవ్రమైన చల్లటి గాలులతో జరిగినట్లు గుర్తించారు. వేడిగాలులతో 1,75,000(32 శాతం) మరణాలు జరిగాయి. శీతల గాలులతో(30 శాతం) 4,57,000 నవజాత శిశువుల మరణాలు తగ్గినట్లు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.


0.9 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత..

29 దేశాలలో జరిపిన అధ్యయనంలో, 2001 - 2019 మధ్య కాలంలో వార్షిక ఉష్ణోగ్రతలు సగటున 0.9 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. వాతావరణంలో రోజురోజుకి పెను మార్పులు సంభవిస్తున్నట్లు తేలింది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పసికూనలపై పడుతోంది. పాకిస్థాన్, మాలి, సియెర్రా లియోన్, నైజీరియా దేశాల్లో అత్యధిక శిశు మరణాలు సంభవించాయి.


అప్పుడే పుట్టిన శిశువుల శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండదు. 2019లోనే 2.4 మిలియన్ల మంది పసికూనలు చనిపోయారు. 5 సంవత్సరాల్లోపు పిల్లల్లో దాదాపు 47 శాతం మరణాలు సంభవించాయి. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది.

For Latest News and National News Click Here

Updated Date - Jul 07 , 2024 | 04:05 PM