Share News

Silky Hair: ఈ 5 చిట్కాలలో దేన్నీ ఫాలో అయినా చాలు.. పట్టు కుచ్చు లాంటి జుట్టు మీ సొంతం..!

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:19 PM

టీవీ యాడ్స్ లో మోడల్స్ లానూ, హీరోయిన్ల లానూ జుట్టును పట్టు కుచ్చులా మెరిసిపోయేలా చేసుకోవడానికి అమ్మాయిలు బోలెడు ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ వీటి వల్ల అంత ఆశించిన ఫలితం ఉండదు. ఇంటి పట్టునే అమ్మాయిలు జుట్టును పట్టు కుచ్చులా మార్చుకోవాలంటే ఈ కింది 5 టిప్స్ లో ఏ ఒక్కటి ఫాలో అయినా

Silky Hair:  ఈ 5 చిట్కాలలో దేన్నీ ఫాలో అయినా చాలు.. పట్టు కుచ్చు లాంటి జుట్టు మీ సొంతం..!
Hair

అమ్మాయిలు అందం గురించి చాలా కేర్ తీసుకుంటారు. జుట్టు దగ్గర నుండ కాలి గోర్ల వరకు ప్రతిదీ అందంలో భాగమే.. ముఖ్యంగా జుట్టు సంరక్షణ విషయంలో, జుట్టు పెరుగుదల కోసం అమ్మాయిలు చాలా రకాల టిప్స్ ఫాలో అవుతారు. టీవీ యాడ్స్ లో మోడల్స్ లానూ, హీరోయిన్ల లానూ జుట్టును పట్టు కుచ్చులా మెరిసిపోయేలా చేసుకోవడానికి బోలెడు ప్రోడక్ట్స్ కూడా ఉపయోగిస్తారు. కానీ వీటి వల్ల అంత ఆశించిన ఫలితం ఉండదు. ఇంటి పట్టునే అమ్మాయిలు జుట్టును పట్టు కుచ్చులా మార్చుకోవాలంటే ఈ కింది 5 టిప్స్ లో ఏ ఒక్కటి ఫాలో అయినా మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే..

రైస్ వాటర్..

బియ్యం నీరు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతోంది. బియ్యాన్ని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి, ఆ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. 10-15 నిమిషాలు దాన్ని అలాగే ఉంచాలి. బియ్యం నీటిలో ఇనోసిటాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది దెబ్బ తిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. జుట్టును మృదువుగా, స్ట్రైయిట్ గా చేస్తుంది.

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!


పెరుగు, తేనె..

పెరుగును తేనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టింటి మూలాల నుండి చివర్ల వరకు మసాజ్ చేయాలి. 20-30 నిమిషాలు దీన్ని అలాగే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ జుట్టును హేడ్రేట్ చేస్తుంది. మృదువుగా మారుస్తుంది. టెంకాయ పీచులా ఉన్న జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది.

గుడ్డు మాస్క్..

గుడ్డు ఆరోగ్యానికే కాదు సౌందర్య చిట్కాలలో కూడా బాగా ఉపయోగపడుతుంది. రెండు గుడ్లలో ఒక స్పూన్ ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టి 30 నిమి,ాల పాటూ అలాగే ఉంచాలి. ఆ తరువాత కడిగేయాలి. గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేసి మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!


కలబంద..

అలోవెరా జెల్ లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే.. జుట్టును మృదువుగా ఉంచే ఎంజైమ్ లు ఉంటాయి. తాజా అలోవెరా జెల్ ను తీసి జుట్టుకు అప్లై చెయ్యాలి. 30 నిమిషాల పాటూ దాన్ని అలాగే వదిలేయాలి. అ తరువాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. అలోవెరా జెల్ జుట్టును లోతుగా కండిషన్ చేస్తుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది.

అరటి, తేనె..

పండిన అరటిపండును మెత్తగా చేసి తేనెతో కలిపి మాస్క్ తయారుచేసుకోవాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. జుట్టుకు షైనింగ్ ఇస్తుంది.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 24 , 2024 | 03:19 PM