Share News

Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:33 AM

బంగ్లాదేశీయులు లక్షల సంఖ్యలో గల్ఫ్‌ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. స్వదేశంలో పరిణామాలను సోమవారం వీరంతా అత్యంత ఆసక్తిగా పరిశీలించారు.

Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

బంగ్లాదేశీయులు లక్షల సంఖ్యలో గల్ఫ్‌ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. స్వదేశంలో పరిణామాలను సోమవారం వీరంతా అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. హసీనా రాజీనామా చేయనున్నట్లుగా కథనాలు రావడంతో పనులను పక్కనపెట్టి ఇళ్లకు ఫోన్లు చేసి ఆరాలు తీశారు.

కాగా, స్వదేశంలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావం తెలిపినందుకు పెద్ద సంఖ్యలో గల్ఫ్‌ దేశాల్లోని బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేసి జైలు శిక్షలు విధించారు. వీధులలో శాంతియుతంగా గూమిగూడినా ఊరుకోలేదు. ఫేస్‌బుక్‌ లో సంఘీభావ సందేశాలను పెట్టినందుకు దుబాయ్‌లోని బంగ్లాదేశీ ప్రవాసీయులను అరెస్ట్‌ చేశారు.

హసీనా వాస్తవానికి గల్ఫ్‌ దేశాలలో బంగ్లాదేశ్‌ వీసాలపై ఉన్న ఆంక్షలను తొలగించి, ఉపాధికి దోహదం చేశారు. కానీ, బంగ్లాదేశ్‌లో పెరిగిపోతున్న మత ఛాందసవాదులకు ఆమె ధోరణి నచ్చలేదు. మోదీ పాలనలోని భారత్‌తో ఆమె సత్ససంబధాలు నెరపడం వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది.

Updated Date - Aug 06 , 2024 | 04:33 AM