Share News

Bangladesh: రిజర్వేషన్లకు తోడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. షేక్ హసీనా ప్రభుత్వంపై నిరసనకారుల ఆగ్రహజ్వాలలు

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:04 AM

బంగ్లాదేశ్‌లో(Bangladesh) ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు.. ఢాకాకు 40 కి.మీల దూరంలో గల నర్సింగ్డిలోని ఓ జైలును ముట్టడించారు.

Bangladesh: రిజర్వేషన్లకు తోడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. షేక్ హసీనా ప్రభుత్వంపై నిరసనకారుల ఆగ్రహజ్వాలలు

ఢాకా: బంగ్లాదేశ్‌లో(Bangladesh) ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు.. ఢాకాకు 40 కి.మీల దూరంలో గల నర్సింగ్డిలోని ఓ జైలును ముట్టడించారు.

అందులోని వందల మంది ఖైదీలను విడిపించారు. అనంతరం జైలుకు నిప్పుపెట్టారని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఘర్షణల్లో 19 మంది పౌరులు మరణించగా... పోలీసులతో పాటు వందల మంది గాయపడ్డారని చెప్పారు. కాగా, ఘర్షణల్లో ఇప్పటి వరకు మొత్తం 105 మంది మరణించారని అధికారులు తెలిపారు.


హింసాత్మకంగా నిరసనలు..

విద్యార్థుల నిరసనలపై హింసాత్మక అణిచివేత జరిగింది. దీని ఫలితంగా వారం వ్యవధిలో ఇప్పటివరకు 105 మందికిపైగా చనిపోయారు. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగాల కోటాలపై అసంతృప్తితో చెలరేగిన నిరసనలు, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం వంటి ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా జరిగాయి.

నిరసనకారులు ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృత ఉద్యమాలు చేశారు. వారిని అడ్డుకోవడానికి అధికారులు ఇంటర్నెట్ సేవలను ఆపేశారు.


ప్రతిపక్షాల మద్దతు

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. నాయకులు, కార్యకర్తలు, పౌరులు విద్యార్థులకు అండగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించాలని రెహమాన్ పిలుపునిచ్చారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ నిరసనకారులపై "రజాకార్" అనే ముద్ర వేసింది.

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా కల్పించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కాగా, బంగ్లాలో ఘర్షణలు తీవ్రతరమవుతుండడంతో శుక్రవారం ఎంబీబీఎస్‌ చదువుతున్న 300 మంది భారతీయులు వెనక్కి వచ్చారు.

For Latest News and National News click here

Updated Date - Jul 20 , 2024 | 08:10 AM