Share News

Tariff: చైనాకు గట్టి షాక్.. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై 100% పన్ను

ABN , Publish Date - Aug 26 , 2024 | 09:34 PM

చైనాలో తయారు చేసిన ఈవీల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం, చైనీస్ స్టీల్, అల్యూమినియంపై 25 శాతం పన్ను విధిస్తామని వెల్లడించింది. అయితే ఇటివల అమెరికా ప్రకటించిన మాదిరిగానే కెనడా నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Tariff: చైనాకు గట్టి షాక్.. ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై 100% పన్ను
Canada imposes a 100% tariff

చైనా(china) తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), చైనీస్ స్టీల్‌పై కెనడా(Canada) అధిక సుంకాలను విధించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సోమవారం హాలీఫాక్స్‌లో మాట్లాడిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కీలక ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో చైనీస్ నిర్మిత ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం, చైనీస్ స్టీల్, అల్యూమినియంపై 25 శాతం పన్ను విధిస్తామని వెల్లడించారు. కెనడాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూడో తెలిపారు. అయితే ఇటివల చైనీస్ EVలపై ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి సుంకాలను పెంచుతున్నట్లు మే నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కెనడా కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం విశేషం.


దిగుమతి

టెస్లా ప్రస్తుతం కెనడాలోకి దిగుమతి చేసుకుంటున్న చైనీస్ నిర్మిత EVలు మాత్రమే షాంఘై ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డాయి. ప్రస్తుతం చైనా బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు కెనడాలోకి విక్రయించబడటం లేదా దిగుమతి కావడం లేదు. కెనడా ఈ విషయంలో US, EUలోని దాని భాగస్వాములతో కలిసి పని చేస్తుందని కెనడా ఉప ప్రధాన మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తెలిపారు. ఎందుకంటే ఉత్తర అమెరికాలో ఇంటిగ్రేటెడ్ ఆటో సెక్టార్ ఉంది. చైనా అదనపు సరఫరా కోసం కెనడా 'డంపింగ్ సైట్'గా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఫ్రీలాండ్ అన్నారు.


100 శాతం

దిగుమతి చేసుకున్న ఉక్కు, అల్యూమినియం, పాత సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ భాగాలు, కీలకమైన ఖనిజాలు, సౌర ఘటాలు, క్రేన్లు, వైద్య ఉత్పత్తులపై సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్త టారిఫ్ రేట్లు ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం, సోలార్ కాంపోనెంట్స్‌పై 50 శాతం, అన్ని ఇతర రంగాలకు 25 శాతం వచ్చే రెండేళ్లలో వర్తిస్తాయని ప్రకటించారు. ట్రూడో ప్రభుత్వం ఇటివల ఈ అంశంపై 30 రోజుల సంప్రదింపులను ప్రారంభించింది.


ధరలు మరింత

US, యూరోపియన్ కమిషన్ చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలపై అధిక దిగుమతి సుంకాలను విధించే ప్రణాళికలను ప్రకటించిన కొద్ది వారాల తర్వాత కెనడా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు EVలపై సుంకం పెంపు విషయంలో మాత్రం చైనీస్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో టెస్లా కార్లు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. ఎందుకంటే 100 శాతం పన్ను విధిస్తే ఆయా వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే స్వదేశంలో ఉత్పత్తి చేసిన వాహనాలపై మాత్రం సుంకం తగ్గిస్తామని ఆయా ప్రభుత్వాలు చెబుతుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

TRAI: ట్రాయ్ కొత్త రూల్స్.. సెప్టెంబర్ 1 నుంచి ఓటీపీ ట్రబుల్స్..

Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. సెబీ నోటీస్ నేపథ్యంలో షేర్లు ఏకంగా..

RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

Read More International News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 09:37 PM