Share News

Crap Attack: చెత్తతో యుద్ధం.. నార్త్ కొరియా-సౌత్ కొరియా మధ్య ముదురుతున్న వివాదం..

ABN , Publish Date - May 29 , 2024 | 04:47 PM

సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య చెత్తతో యుద్ధం నడుస్తోంది. ఉత్తర కొరియా చెత్త, మలంతో కూడిన బెలూన్లను దక్షిణ కొరియాలో వదిలిపెట్టింది. సుమారు 260కు పైగా ఈ రకమైన బెలూన్లను వదలడంతో దక్షిణ కొరియా సైన్యం అప్రమత్తమైంది. ప్రజలంతా తమ ఇళ్లల్లోనే ఉండాలని అత్యవసరమైతే మినహా బయటకు రావొద్దని సౌత్ కొరియా అధికారులు ఆదేశాలు జారీచేశారు

Crap Attack: చెత్తతో యుద్ధం.. నార్త్ కొరియా-సౌత్ కొరియా మధ్య ముదురుతున్న వివాదం..
South And North Korea

సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య చెత్తతో యుద్ధం నడుస్తోంది. ఉత్తర కొరియా చెత్త, మలంతో కూడిన బెలూన్లను దక్షిణ కొరియాలో వదిలిపెట్టింది. సుమారు 260కు పైగా ఈ రకమైన బెలూన్లను వదలడంతో దక్షిణ కొరియా సైన్యం అప్రమత్తమైంది. ప్రజలంతా తమ ఇళ్లల్లోనే ఉండాలని అత్యవసరమైతే మినహా బయటకు రావొద్దని సౌత్ కొరియా అధికారులు ఆదేశాలు జారీచేశారు. తెలుపు రంగు బెలూన్లను ఎవరూ ముట్టుకోవద్దని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. ఆ బెలూన్లలో చెత్త, మలం ఉన్నట్లు వాసన ఆధారంగా అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియాలోని ఎనిమిది ప్రావిన్సుల్లో ఆ రకమైన బెలూన్లను అధికారులు గుర్తించారు. ఆ బెలూన్లలో ఏముంది.. ఉత్తర కొరియా ఇక్కడ వదలడానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని దక్షిణ కొరియా తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో దక్షిణ కొరియా కొన్ని కరపత్రాలను వదులుతోందని.. అలా చేస్తే తాము సహించేది లేదని.. తామెంటో చూపిస్తామంటూ గతంలోనే ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ క్రమంలో చెత్త, మలంతో నిండిన బెలూన్లను దక్షిణ కొరియాలో వదిలినట్లు తెలుస్తోంది.

China-Taiwan: చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తత.. 13 సైనిక విమానాలు, 9 నౌకల మోహరింపు


తెల్ల బెలూన్లలో ఏముంది..

దక్షిణ కొరియాలోని కొన్ని ప్రాంతాల్లో తెల్ల బెలూన్లు కనిపిస్తున్నాయి. వీటిని ఉత్తర కొరియా వదిలినట్లు సౌత్ కొరియా సైన్యం తెలిపింది. ఈ బెలూన్లలో చెత్తా చెదారంతో పాటు మలం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తెల్ల బెలూన్లు, వాటికి తగిలించి ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్‌‌లను ముట్టుకోవద్దంటూ ప్రజలకు దక్షిణ కొరియా సైన్యం హెచ్చరించింది.

దక్షిణ కొరియాలోని తొమ్మిది ప్రావిన్స్‌లలో ఎనిమిది చోట్ల ఈ బెలూన్లను అధికారులు గుర్తించారు. 1950లో కొరియన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య బెలూన్లతో యుద్ధం జరుగుతోంది. ఒక దేశం పైకి మరొక దేశం ఈ రకమైన బెలూన్లను పంపుతున్నారు.


ముందుగానే వార్నింగ్..

తమ సరిహద్దు ప్రాంతాల్లో కరపత్రాలను, చెత్తా చెదారాన్ని వేస్తుండటంపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తర కొరియా హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్తా చెదారాన్ని త్వరలోనే రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ROK) సరిహద్దు ప్రాంతాల్లో వెదజల్లుతామని.. వాటిని తొలగించడానికి ఎంత శ్రమించాల్లో సౌత్ కొరియాకు అర్థమవుతుందంటూ నార్త్ కొరియా ఇటీవల వార్నింగ్ ఇచ్చింది.


దక్షిణ కొరియా వాసులకు మెసేజ్‌లు.

దక్షిణ కొరియాలో ఉత్తర కొరియా చెత్తా చెదారాలతో కూడిన బెలూన్లు విసరడంతో దక్షిణ కొరియా రాజధాని సోల్‌కు ఉత్తరం వైపు, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారుల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. ఇళ్లల్లోంచి కొంతసేపు బయటకు రావొద్దని ఈ మెసేజ్‌లలో ఉంది. అనుమానిత వస్తువులు కనిపిస్తే సమీపంలోని మిలటరీ బేస్ లేదా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సౌత్ కొరియా అధికారులు సూచించారు.


Viral Video: టగ్ ఆఫ్ వార్‌లో చైనా సైనికులపై భారత్ సైనికుల విజయం

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest International News and Telugu News

Updated Date - May 29 , 2024 | 04:47 PM