Share News

Titanic: టైటానిక్ వద్దకు మరో సబ్ మెర్సిబుల్..!!

ABN , Publish Date - May 28 , 2024 | 08:05 PM

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడ మునిగిపోయిన ఘటనపై ఆతృత ఏమాత్రం తగ్గడం లేదు. టైటానిక్ ఓడ మునిగిపోయిన స్థలం చూసేందుకు గత ఏడాది టైటాన్ అనే సబ్ మెర్సిబుల్‌లో ఐదుగురు పర్యాటకులు వెళ్లిన సంగతి తెలిసిందే. వెళ్లిన తర్వాత అందులో పీడనం ఎక్కువై పేలి జల సమాధి అయ్యారు. దాంతో ఓషియన్ గేట్ సంస్థపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ పెద్దగా లెక్క చేయ లేదు. ఇప్పుడు అమెరికా రియల్ ఎస్టేట్ వ్యాపారి లారీ కానర్ సాహస యాత్ర పూర్తి చేస్తామని అంటున్నారు.

Titanic: టైటానిక్ వద్దకు మరో సబ్ మెర్సిబుల్..!!
Titanic Site

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ ఓడ మునిగిపోయిన ఘటనపై ఆతృత ఏమాత్రం తగ్గడం లేదు. టైటానిక్ ఓడ మునిగిపోయిన స్థలం చూసేందుకు గత ఏడాది టైటాన్ అనే సబ్ మెర్సిబుల్‌లో ఐదుగురు పర్యాటకులు వెళ్లిన సంగతి తెలిసిందే. వెళ్లిన తర్వాత అందులో పీడనం ఎక్కువై పేలి జల సమాధి అయ్యారు. దాంతో ఓషియన్ గేట్ సంస్థపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అమెరికా రియల్ ఎస్టేట్ వ్యాపారి లారీ కానర్ సాహస యాత్ర పూర్తి చేస్తామని అంటున్నారు.


కానర్‌కు ట్రిటాన్ సబ్ మెరైన్స్ తోడయ్యింది. ఆ సంస్థ కో ఫౌండర్ పాట్రాక్ లాహే, కానర్ లారీ ఇద్దరు కలిసి సముద్రంలో 12 వేల 400 అడుగుల లోతు వరకు వెళతామని ప్రకటించారు. సబ్ మెర్సిబుల్ రూపొందించేందుకు పాట్రిక్‌కు పదేళ్ల సమయం పట్టింది. టైటాన్ సబ్ మెర్సిబుల్ పేలిపోగా.. దాని కన్నా మెరుగైనది రూపొందించాలని కోరానని వివరించారు. ఇదే అంశంపై పాట్రిక్ లాహే మాట్లాడుతూ.. సురక్షిత ప్రయాణాలు చేయగల, టైటాన్‌కు విరుద్ధమైన వాహక నౌకను చేయగలమని ప్రపంచానికి చాటి చెప్పాలని కానర్ చెప్పారని వివరించారు. ఆ రెండు సబ్ మెర్సిబుళ్ల కోసం 20 మిలియన్ డాలర్ల ఖర్చయ్యిందని వివరించారు.


అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ సబ్ మెర్సిబుల్ గత ఏడాది జూన్‌లో బయల్దేరిన సంగతి తెలిసిందే. టైటానిక్ ఓడకు 480 మీటర్ల దూరంలో పీడనానికి గురై పేలింది. సబ్ మెర్సిబుల్‌లో ఆక్సిజన్ నాలుగు రోజులకే ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అందులో ప్రయాణించిన ఐదుగురు చనిపోయారు. ఆ తర్వాత ఓషన్ గేట్ సంస్థ తన సాహస యాత్రలను ఆపివేసింది. ఇప్పుడు అమెరికాకు చెందిన కానర్ లారీ, పాట్రిక్ కలిసి మరో సాహస యాత్రకు సిద్దం అవుతున్నారు.



Read Latest
National News and Telugu News

Updated Date - May 28 , 2024 | 08:41 PM