Share News

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ పన్నిన కుట్ర భగ్నం

ABN , Publish Date - Nov 10 , 2024 | 05:07 AM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్యచేసేందుకు ఇరాన్‌ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది.

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ పన్నిన కుట్ర భగ్నం

వాషింగ్టన్‌, నవంబరు9: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్యచేసేందుకు ఇరాన్‌ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. ఫర్హాద్‌ షకేరీ అనే ఆఫ్ఘన్‌ పౌరుడికి ఐఆర్‌జీసీ ఈ బాధ్యతలు అప్పగించిందంటూ ముగ్గురిపై అమెరికా న్యాయ విభాగం మన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్టులో అభియోగాలుమోపింది. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందే ట్రంప్‌ను హత్య చేయాలని ఐఆర్‌జీసీ ఆదేశించినా షకేరీ కావాలనే ఆలస్యం చేశాడు. ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక ట్రంప్‌ను హత్య చేయడం సులభమని భావించి పథకాన్ని వాయిదా వేసుకున్నాడు. ఈలోగా ఎఫ్‌బీఐ ఈ కుట్రను భగ్నం చేసింది. ట్రంప్‌ హత్యతోపాటు న్యూయార్క్‌లోని యూదు అమెరికన్లను, శ్రీలంకలో ఉన్న ఇజ్రాయెలీ పర్యాటకులను చంపాలని కూడా షకేరీనిఐఆర్‌జీసీ ఆదేశించింది. షకేరీ గతంలో అమెరికాలో ఓ దోపిడి కేసులో 14ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. షకేరీ ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్నట్టు సమాచారం. ట్రంప్‌ హత్యకు కుట్ర పన్నారంటూ వచ్చిన ఆరోపణలను ఇరాన్‌ తోసిపుచ్చింది.

Updated Date - Nov 10 , 2024 | 06:55 AM