Imran Khan: మాజీ ప్రధాని భార్యకు రేప్ బెదిరింపులు.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
ABN , Publish Date - Oct 16 , 2024 | 05:13 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో ఉన్న మాజీ ప్రధాని పట్ల పాకిస్థాన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్(pakistan) మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆరోగ్యంపై ఆయన మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్(Jemima Goldsmith) ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించాలని జెమీమా డిమాండ్ చేశారు. అంతేకాదు పాక్‌లో నిరసనలను అణచివేయడానికి ఇమ్రాన్ ఖాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించినట్లు జెమీమా గోల్డ్‌స్మిత్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరుగుతున్న తరుణంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో జెమీమా ఆరోపణలు వ్యక్తం చేశారు.
జెమీమా తీవ్ర ఆరోపణలు
ఇమ్రాన్ ఖాన్ ఏడాదికి పైగా రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆయనపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. SCO మీటింగ్ సమయంలో ఎలాంటి నిరసనలు జరగకుండా నిరోధించడానికి భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్‌ను అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 18 వరకు ఎవరినీ కలవకుండా నిషేధించింది. దీనిపై జెమీమా గోల్డ్‌స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తాను పాకిస్థాన్ అధికార పార్టీ PMLN మద్దతుదారులచే సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన న్యాయవాదులు, కుటుంబ సందర్శనలను తగ్గించిందన్నారు. ఈ నేపథ్యంలో జైలులో ఖాన్ చికిత్స గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఒంటరిగా ఇమ్రాన్
బ్రిటీష్ పౌరురాలు జెమీమా గోల్డ్‌స్మిత్ 1995లో ఇమ్రాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ 2004లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ బ్రిటన్‌లో నివసిస్తున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సమయంలో జైలులో ఇమ్రాన్ ఖాన్ ఒంటరిగా ఉన్నారని జెమీమా తెలిపారు. ఇమ్రాన్ జైలుకు కరెంట్ కట్ చేశారని, ఆ క్రమంలో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడిందన్నారు. అయినప్పటికీ ఆయనను జైలు నుంచి బయటకు రావడానికి అనుమతించడం లేదని ఆరోపించారు. అంతేకాదు వారి వంట మనిషిని కూడా సెలవుపై పంపారని వెల్లడించారు.
ప్రతిపక్షాల విషయంలో
ఇమ్రాన్ కుమారులు కూడా తమ తండ్రితో మాట్లాడేందుకు అనుమతించడం లేదని జెమీమా అన్నారు. పీటీఐ కార్యకర్తలు తనను వేధిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని జెమీమా పేర్కొన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన జెమీమా ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు హసన్ నియాజీని పాక్ ప్రభుత్వం గత ఏడాది నుంచి నిర్బంధించిందని గుర్తు చేశారు. అంతేకాదు ఇమ్రాన్ సోదరీమణులను కూడా ఇటీవలే అరెస్టు చేశారని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More International News and Latest Telugu News