Share News

Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ఏది.. దాని చరిత్ర ఏంటి?

ABN , Publish Date - May 20 , 2024 | 01:58 PM

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. అజర్‌బైజాన్ సమీపంలోని జోల్ఫా ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల..

Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ఏది.. దాని చరిత్ర ఏంటి?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో (Helicopter Crash) దుర్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. అజర్‌బైజాన్ సమీపంలోని జోల్ఫా ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల.. హెలికాప్టర్ అదుపు తప్పి కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే.. ఆ ‘హెలికాప్టర్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు దాని మోడల్ ఏంటి? ఏ సంస్థ దానిని తయారు చేసింది? ఆ హెలికాప్టర్ చరిత్ర ఏంటి? అందులో ఉన్న లోపాలేంటి? అనే విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. పదండి.. ఆ వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Read Also: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్


బెల్-212 విశేషాలు

స్థానిక న్యూస్‌ ఏజెన్సీలు విడుదల చేసిన ఫొటోలు, వీడియోల ప్రకారం.. ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను ‘బెల్‌-212’గా (Bell 212) గుర్తించారు. దీనిని అమెరికాకు చెందిన ‘బెల్‌ టెక్స్‌ట్రాన్‌’ అనే కంపెనీ తయారు చేసింది. ఈ సంస్థ హెడ్‌క్వార్టర్ టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌లో ఉంది. ఈ హెలికాప్టర్‌లో గరిష్టంగా 15 మంది ప్రయాణించవచ్చు. 1960ల చివర్లో.. కెనడియన్ మిలిటరీ కోసం UH-1 ఇరోక్వోయిస్‌కి అప్‌గ్రేడ్‌గా ఈ బెల్-212ని ప్రవేశపెట్టారు. రెండు రెక్కలతో నడిచే ఈ హెలికాప్టర్‌ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో రెండు టర్బోషాఫ్ట్ ఇంజిన్స్ ఉంటాయి.

Read Also: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి

1971లో ఈ బెల్-212 మార్కెట్‌లోకి అందుబాటులోకి రాగానే.. అమెరికా, కెనడా దేశాలు దీనిని వెంటనే స్వీకరించాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేలా ఈ హెలికాప్టర్‌ని తయారు చేశారు. పరిశ్రమలో అత్యంత సమర్థమైనదిగా ఈ బెల్-212 పేరుగాంచడంతో.. దీనిని ‘వర్క్ హార్స్’గా పేర్కొంటారు. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్.. ప్రభుత్వాధికారులను తీసుకెళ్లే రీతిలో కాన్ఫిగర్ చేయబడింది. ఇలాంటి మోడల్స్ ఇరాన్ వద్ద ఎన్ని ఉన్నాయనే పక్కా సమాచారమైతే లేదు. కానీ.. ఫ్లైట్‌గ్లోబల్ 2024 వరల్డ్ ఎయిర్‌ఫోర్స్ డైరెక్టరీ ప్రకారం.. ఇరాన్ ఎయిర్‌ఫోర్స్, నేవీలో కలుపుకొని మొత్తం 10 హెలికాప్టర్స్ ఉండొచ్చని తెలుస్తోంది.


Read Also: ధోనీ రిటైర్‌మెంట్‌పై సీఎస్కే క్లారిటీ.. మరో రెండు నెలల తర్వాత..

గతంలో జరిగిన ప్రమాదాలు

ఈ బెల్-212 హెలికాప్టర్ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైంది. 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్‌కు చెందిన బెల్‌-212 లూసియానా తీరంలో కుప్పకూలింది. మెకానికల్ సమస్య తలెత్తడంతో.. అప్పట్లో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. 2009లో కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌లో ఓ ప్రమాదం జరగ్గా.. అందులో 17 మంది దుర్మరణం చెందారు. ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్‌ కోల్పోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలింది. కాగా.. రైసీ ప్రయాణించిన తాజా హెలికాప్టర్‌ను 1979లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇరాన్‌కి అమెరికా విక్రయాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Read Latest International News and Telugu News

Updated Date - May 20 , 2024 | 02:28 PM