MS Dhoni: ధోనీ రిటైర్‌మెంట్‌పై సీఎస్కే క్లారిటీ.. మరో రెండు నెలల తర్వాత..
ABN , Publish Date - May 20 , 2024 | 11:31 AM
ఐపీఎల్-2024 ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సీజన్ ముగిశాక..
ఐపీఎల్-2024 (IPL 2024) ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి (MS Dhoni) ఇదే చివరి సీజన్ అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సీజన్ ముగిశాక అతను రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని, ప్లేయర్‌గా తప్పుకొని జట్టుకి మెంటార్‌గా బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై సీఎస్కే అధికారి ఒకరు స్పందించారు. ధోనీ తన రిటైర్‌మెంట్ గురించి ఎవరికీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.
Read Also: హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి
‘‘ధోనీ తన రిటైర్‌మెంట్ గురించి సీఎస్కే ఫ్రాంచైజీలో ఎవరికీ చెప్పలేదు. రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు నెలల సమయం వేచి ఉంటానని మేనేజ్‌మెంట్‌తో దోనీ చెప్పాడు’’ అని ఆ సీఎస్కే అధికారి వెల్లడించారు. అంతేకాదు.. ధోనీలో ఎనర్జీ ఇంకా తగ్గలేదని, వికెట్ల మధ్య పరుగులు తీయడంలో ఎలాంటి అసౌకర్యాన్ని అతను చవిచూడటం లేదని, ఇది ఒక ప్లస్ పాయింట్ అని ఆయన తెలిపారు. ధోనీ నిర్ణయం కోసం తాము వేచి ఉంటామని.. జట్టు ప్రయోజనాలను గురించే అతను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడని అన్నారు. మొత్తానికి.. ధోనీ ఇప్పుడప్పుడే రిటైర్‌మెంట్ ఇవ్వడని క్లారిటీ వచ్చేసినట్లే. తదుపరి సీజన్‌లోనూ అతడు కొనసాగే అవకాశం ఉంది.
Read Also: చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ ఆల్‌టైం రికార్డు ఔట్
కాగా.. ధోనీ రిటైర్‌మెంట్ నిర్ణయంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమం కూడా కీలకపాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ నియమంపై క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి కాబట్టి.. వచ్చే సీజన్ నుంచి దీనిని కొనసాగించాలా? వద్దా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ని కొనసాగిస్తే.. అప్పుడు ధోనీ ప్లేయర్‌గా బరిలోకి దిగొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే.. ఫీల్డ్‌లో దిగకుండా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటర్‌గా తన సేవలు అందించొచ్చు. అలా కాకుండా ఈ నియమాన్ని రద్దు చేస్తే మాత్రం.. ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఆడటం దాదాపు కష్టమేనని క్రీడా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి.. ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Read Latest Sports News and Telugu News