Share News

Hezbollah: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. రివర్స్ ఎటాక్ చేసిన హిజ్బుల్లా

ABN , Publish Date - Aug 25 , 2024 | 10:17 AM

ఇజ్రాయెల్(Israel) లెబనాన్‌(lebanon)లోని షియా మిలీషియా హిజ్బుల్లా(hezbollah) స్థానాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులు(airstrikes) చేసింది. దీనికి ప్రతి స్పందనగా హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడిని ప్రారంభించింది. వీరు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులను ప్రారంభించారు.

Hezbollah: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. రివర్స్ ఎటాక్ చేసిన హిజ్బుల్లా
Israeli airstrikes on Hezbollah

ఇజ్రాయెల్(Israel) లెబనాన్‌(lebanon)లోని షియా మిలీషియా హిజ్బుల్లా(hezbollah) స్థానాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులు(airstrikes) చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత, ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమానాలు దారి మళ్లించబడ్డాయి. ఈ క్రమంలో మరికొన్ని ఇతర విమానాలు ఆలస్యం అయ్యాయి. దీనికి ముందు ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా ఇజ్రాయెల్ భూభాగం వైపు క్షిపణులు, రాకెట్లను పేల్చేందుకు సిద్ధమవుతోందని ఒక ప్రకటన విడుదల చేసింది.


రివర్స్ ఎటాక్

లెబనాన్(lebanon) నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ వైమానిక దళం దాదాపు 40 లక్ష్యాలను చేధించింది. ఈ చర్యను ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ శనివారం రాత్రి ఆమోదించారు. ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై దాడులు చేయడంతో ఇజ్రాయెల్ హిజ్బుల్లా వివాదం మరింత తీవ్రమైంది. ప్రతిస్పందనగా హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడిని ప్రారంభించింది. వీరు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులను ప్రారంభించారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన మొదటి దశలో 320కి పైగా కత్యుషా రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేశామని హిజ్బుల్లా ఆదివారం ఉదయం గొప్పగా చెప్పుకోవడం విశేషం.


జరిగిన వెంటనే

హిజ్బుల్లా ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేయడానికి పన్నాగం పన్నుతోందని ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి అన్నారు. త్వరలో రాకెట్లతో కాల్పులు జరుపుతుందని అందుకే బెదిరింపులకు వ్యతిరేకంగా లెబనాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపారు. ఇది జరిగిన వెంటనే ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్‌లు మోగడం ప్రారంభించాయి. లెబనీస్ మీడియా దేశంలోని దక్షిణ భాగంలో దాడులను గుర్తించింది. కానీ వివరాలను అందించలేదు. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న కొన్ని వీడియోలు దక్షిణ లెబనాన్‌లో జరుగుతున్న దాడులను చూపించాయి.


అగ్రశ్రేణి కమాండర్

ఫ్లైట్ కదలికలను పర్యవేక్షించే ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఈ ప్రకటన తర్వాత కనీసం రెండు EL AI విమానాలు దక్షిణం వైపు మళ్లించినట్లు తెలిపారు. హగారి తన ప్రకటనలో లెబనీస్ పౌరులను ప్రమాదంలో పడేస్తూ ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేయడానికి హిజ్బుల్లా సిద్ధమవుతుందన్నారు. హగారి ఈ ఘటన గురించి మరిన్ని వివరాలను అందించలేదు. హిజ్బుల్లా చురుకుగా ఉన్న ప్రాంతాల్లో నివసించే పౌరులు తమ భద్రత కోసం వెంటనే వెళ్లిపోవాలని తాము హెచ్చరించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ దాడిలో అగ్రశ్రేణి హిజ్బుల్లా కమాండర్ మరణించారు. ఇరాన్‌లో అనుమానాస్పద ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా మరణించిన తరువాత గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత వివాదంగా మారింది.


ఇవి కూడా చదవండి:

Pavel Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్.. కారణమిదే..

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం


Read More International News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 10:19 AM