Deepfake: ప్రధానిపై డీప్ ఫేక్ వీడియోలు.. రూ.90 లక్షల దావా వేసిన పీఎం
ABN , Publish Date - Mar 21 , 2024 | 02:08 PM
ప్రస్తుతం డీప్‌ఫేక్(deepfake) వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని(giorgia Meloni)పై కూడా ఈ డీప్‍ఫేక్ వీడియోలు(deepfake videos) రూపొందించి ఓ పోర్న్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.
ప్రస్తుతం డీప్‌ఫేక్(deepfake) వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని(giorgia Meloni)పై కూడా ఈ డీప్‍ఫేక్ వీడియోలు(deepfake videos) రూపొందించి ఓ పోర్న్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో ఇటలీ ప్రధాని(Italian PM) జార్జియా మెలోని ముఖాన్ని మరో మహిళకు అతికించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇది తెలిసిన ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జార్జియా మెలోని నిందితులపై 1 లక్ష యూరోల(90 లక్షల రూపాయలు) నష్టపరిహారాన్ని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ డీప్‌ఫేక్ వీడియోల కేసులో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి 50 ఏళ్లు కాగా, మరో నిందితుడికి 73 ఏళ్లు. అయితే ఆ వీడియో 2022 సంవత్సరానికి చెందినదని, ఆ వీడియో అమెరికా పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడిందని అధికారులు గుర్తించారు. ఆ వీడియో వీక్షణలు ఇప్పటివరకు లక్షలకు చేరుకున్నాయని పోలీసులు(police) తెలిపారు. కానీ అప్పటికే ఆమె ప్రధానిగా లేకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఈ కేసులో మెలోని జూలై 2న వాంగ్మూలం ఇవ్వనున్నారు.
ప్రధాని మెలోని(giorgia Meloni) డిమాండ్ చేస్తున్న పరిహారం సరైనదేనని ఈ కేసులో మెలోని తరఫున వాదిస్తున్న న్యాయవాది మరియా గియులియా అన్నారు. ఈ నష్టపరిహారం డిమాండ్ ఉద్దేశ్యం మహిళలపై(womens) జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించడమేనని చెప్పారు. ఆ పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తామని వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?