Share News

London : సునాక్‌ స్థానం కోసం భారత సంతతి మహిళ పోటీ

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:12 AM

బ్రిటన్‌ ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీ అధ్యక్ష రేసులో మొదటి సారిగా ఓ మహిళ, భారత సంతతి వ్యక్తి అయిన ప్రీతి పటేల్‌ (52) పోటీ పడుతున్నారు. ఈమె గతంలో బ్రిటన్‌ హోం సెక్రటరీగా పని చేశారు.

London : సునాక్‌ స్థానం కోసం భారత సంతతి మహిళ పోటీ

  1. బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీ అధ్యక్ష రేసులో ప్రీతి

లండన్‌, జూలై 28: బ్రిటన్‌ ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీ అధ్యక్ష రేసులో మొదటి సారిగా ఓ మహిళ, భారత సంతతి వ్యక్తి అయిన ప్రీతి పటేల్‌ (52) పోటీ పడుతున్నారు. ఈమె గతంలో బ్రిటన్‌ హోం సెక్రటరీగా పని చేశారు.

ఈ నెల 4న బ్రిటన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రిషీ సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటీవ్‌ పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ జూలై 5న రిషీ సునాక్‌ తన పదవికి రాజీనామా చేశారు.

దాంతో కన్జర్వేటీవ్‌ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమయింది. కాగా, సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు ప్రీతి పటేల్‌తో పాటు మరో నలుగురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లను దాఖలు చేసిన వారిలో మాజీ మంత్రులు జేమ్స్‌ క్లెవర్లీ, టామ్‌ తుగెంధాత్‌, మెల్‌ స్ట్రైడ్‌, రాబర్ట్‌ జెనరిక్‌ ఉన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 03:12 AM