PM Modi: మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం
ABN , Publish Date - Nov 17 , 2024 | 07:10 PM
ఆదివారం ఉదయం అధ్యక్షుడి ప్రాసాదంలో నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ను మోదీ కలుసుకున్నారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు.
అబుజా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి నైజీరియా (Nigeria) ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజెర్' (Grand Commanderof the Order of the Niger)ను ఆదివారం ప్రదానం చేసింది. అబుజలో పర్యటన సందర్భంగా మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్‌వో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి సింబాలిక్‌గా 'అబుజా సిటీ కీ' ని బహూకరించారు.
PM Modi: నిజం బయటకు వస్తోంది.. 'ది సబర్మతి రిపోర్ట్'పై మోదీ ప్రశంస
కాగా, ఆదివారం ఉదయం అధ్యక్షుడి ప్రాసాదంలో నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు (Bola Ahmed Tinubu) ను మోదీ కలుసుకున్నారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి, శతాబ్దాలుగా ఇండియా-నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని, 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని అన్నారు.
మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత మోదీ నైజారియాలో అడుగుపెట్టారు. అనంతరం బ్రెజిల్, గుయానాలో పర్యటించనున్నారు. ఈనెల 17 నుంచి 21 వరకూ ఆయన పర్యటన ఉంటుంది. నైజీరియా అధ్యక్షుడు టినుబు ఆహ్వానం మేరకు ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు మోదీ ఈ దేశంలో పర్యటిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం
Read More International News and Latest Telugu News